వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మళ్లీ నరేంద్ర మోడిదే హవా!: పెరిగిన ముస్లింల మద్దతు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Narendra Modi
అహ్మదాబాద్: వచ్చే డిసెంబర్ నెలలో జరగనున్న సాధారణ ఎన్నికలలు గుజరాత్ ఎన్నికలలో మళ్లీ భారతీయ జనతా పార్టీయే ఘన విజయం సాధించనుందని సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఎన్నికలకు మరెంతో దూరం లేనందున సర్వే సంస్థలు గుజరాత్ ప్రజలు ఎవరి ఓటు వేస్తారో తెలుసుకునేందుకు పలు దఫాలుగా సర్వేలు చేస్తున్నాయి. ప్రారంభంలో బొటాబొటి మెజార్టీతో బిజెపియే మళ్లీ గుజరాత్‌ను దక్కించుకుంటుందని చెప్పిన సర్వేలు తాజాగా అద్భుత విజయం సాధిస్తాయని చెబుతున్నాయి.

కేవలం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ అనే పదం ఒక్కటే బిజెపి ఘన విజయానికి తోడ్పడుతుందని చెబుతున్నాయి. బిజెపిని పార్టీగా కంటే మోడిని వ్యక్తిగా గుజరాత్ రాష్ట్ర ప్రజలు ఎంతో ఎక్కువగా ఆదరిస్తున్నారట. మోడికే ఓటు వేసేందుకు మెజార్టీ ప్రజలు సిద్ధంగా ఉన్నారట. ఆయన రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపిన తీరు, అభివృద్ధి, ఉద్యోగాలు తదితరాల కారణంగా ఆయనకే మళ్లీ పట్టం కడితే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందనే విశ్వాసంతో ప్రజలు ఉన్నారట.

2007 కంటే ఇప్పుడు బిజెపికి ఓటింగ్ శాతం రెండు వరకు పెరగవచ్చునని, ఈ ఓటింగ్ శాతమే బిజెపి గతంలో కంటే ఎక్కువ స్థానాలలో గెలుపొందేందుకు అవకాశముందని చెబుతున్నారు. ముస్లిం ఓటర్లు మద్దతు కూడా మోడీకి క్రమంగా పెరుగుతోందని చెబుతున్నారు. 2007లో 14 శాతం మంది ముస్లింలు మోడీకి మద్దతు పలకగా ఇప్పుడు అది 23 శాతానికి పెరిగింది.

అయితే మోడీకి కేశూభాయ్ పటేల్ షాకిచ్చే అంశాన్ని కూడా కొట్టి పారేయలేమని చెబుతున్నారు. ఇప్పటి వరకు ఇలా ఉన్నప్పటికి కేశూభాయ్ కారణంగా బిజెపి ఓట్లు కొద్దిగా చీలి నష్టపరుస్తుందని చెబుతున్నారు. మరో విషయమేమంటే గుజరాత్ ఎన్నికలే 2014లో మోడీ ప్రధాని అభ్యర్థిగా ఉంటారా లేదా అని తేల్చనున్నాయి.

English summary
Voicing support for Gujarat Chief Minister Narendra Modi, BJP’s Bihar unit chief CP Thakur on Tuesday said that the results of the Assembly Elections will decide if the latter would become the NDA's prime ministerial candidate.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X