వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రామ్ జెత్మలానీ సవాల్: గంటల్లో వేటు వేసిన బిజెపి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Ram Jethmalani
న్యూఢిల్లీ: ప్రముఖ న్యాయవాది, రాజ్యసభ సభ్యుడు రామ్ జెత్మలానీని భారతీయ జనతా పార్టీ ఆదివారం బహిష్కరించింది. ఇటీవల ఆయన తన వ్యాఖ్యలతో బిజెపిని చిక్కుల్లో పడేసిన విషయం తెలిసిందే. శ్రీరాముడుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత పార్టీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీని అవినీతిపరుడు అంటూ ధ్వజమెత్తారు. తాజాగా సిబిఐ డైరెక్టర్ నియామకాన్ని బిజెపి వ్యతిరేకిస్తే.. జెత్మలానీ మాత్రం ప్రధానికి కితాబిచ్చారు.

అంతేకాకుండా దమ్ముంటే చర్యలు తీసుకోవాలని అధిష్టానానికి సవాల్ విసిరారు. తనపై చర్యలు తీసుకునే దమ్ము ఎవరికీ లేదని ఆయన ఆదివారం ముంబయిలో సవాలు విసిరిన కొద్ది గంటల్లోనే బిజెపి అధిష్ఠానం ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ముంబైలో ఒక పుస్తకావిష్కరణ సభలో పాల్గొన్న జెఠ్మలానీ.. సిబిఐ డైరెక్టర్‌గా ఐపిఎస్ అధికారి రంజిత్ సిన్హా నియామకంపై పార్టీ అభిప్రాయానికి వ్యతిరేకంగా మాట్లాడారు.

సిన్హా నియామకాన్ని వ్యతిరేకిస్తూ ఇప్పటికే బిజెపి నేతలు సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ ప్రధానికి ఉత్తరం రాసిన నేపథ్యంలో.. జెత్మలానీ అధిష్ఠానం తీరును తప్పుబడుతూ, ఆయన నియామకాన్ని స్వాగతించారు. అయితే ఇది తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేమని ఆయన చెప్పుకొన్నారు. పార్టీలో తానొక చిన్న వ్యక్తిని అన్న జెత్మలానీ తనపై తీసుకునే ఏ చర్యనైనా స్వాగతిస్తానని చెప్పారు. అయితే అంత ధైర్యం ఎవరికీ లేదన్నారు. తనలాగే ఆలోచించే వాళ్లు పార్టీలో చాలా మంది ఉన్నాని చెప్పారు.

గడ్కరీపై జెత్మలానీ చేసిన వాదనతో పార్టీలోని యశ్వంత్ సిన్హా, శతృఘ్న సిన్హాలు కూడా సమర్థించారు. జెత్మలానీ ఆరోపణలపై పార్టీ తీవ్రంగా ఆలోచించాలని శతృఘ్న సిన్హా శనివారం విలేకరులతో చెప్పారు. జెత్మలానీ ప్రధాని పదవికి మోడీ అభ్యర్థిత్వాన్ని బహిరంగంగా సమర్థించడం కూడా బిజెపి అధిష్ఠానానికి మింగుడు పడడం లేదు. జెత్మలానీ ఇటీవల పార్టీకి వ్యతిరేకంగా చేస్తున్న వ్యాఖ్యలపై ఆయనపై చర్య తీసుకునే అవకాశం ఉందని పార్టీ శనివారమే సూచన చేసింది.

English summary
Reacting to Ram Jethmalani's constant diatribe against party chief Nitin Gadkari, the BJP on Sunday suspended the eminent lawyer from its membership, referring his case to the party's parliamentary board which is empowered to expel the Rajya Sabha MP. His suspension came hours after he openly said that the party did not have the courage to take action against him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X