వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'ఇందిర బాట' వాయిదాకు బొత్స: కిరణ్ రెడ్డి ససేమీరా

By Srinivas
|
Google Oneindia TeluguNews

Botsa Satyanarayana - Kiran Kumar Reddy
హైదరాబాద్: ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ విస్తృతస్థాయి సమావేశం దృష్ట్యా విశాఖపట్నం జిల్లాలో ప్రభుత్వం తలపెట్టిన ఇందిర బాట కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవాలని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి సూచించినట్లుగా తెలుస్తోంది. అయితే ఇందుకు కిరణ్ కుమార్ ససేమీరా అన్నారట. సోమవారం నుండి మూడు రోజుల పాటు విశాఖ జిల్లాలో ఇందిర బాట కార్యక్రమం ఉంటుందని జిల్లా అధికారులకు సమాచారం ఇప్పటికే అందించారు.

జిల్లా ఇంచార్జ్ మంత్రి ధర్మాన ప్రసాద రావు, మంత్రులు బాలరాజు, గంటా శ్రీనివాస రావు అక్కడే ఉండి ఇందిర బాట కార్యక్రమం ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం వారు హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో జరగనున్న పిసిసి విస్తృత స్థాయి సమావేశానికి హాజరయ్యేందుకు సిద్ధమయ్యారు. ఆ తర్వాత తిరిగి వారు విశాఖకు వెంటనే వెళ్లాల్సి ఉంటుంది. కేవలం ఈ ముగ్గురు నేతలే కాకుండా జిల్లాకు చెందిన నేతలందరి పరిస్థితి ఇదే.

దీంతో రావడం... వెళ్లడం ఇబ్బందిగా మారుతుందని.... కాబట్టి బాటను వాయిదా వేసుకోవాలని బొత్స సూచించారట. కాని కిరణ్ మాత్రం ఒప్పుకోలేదని తెలుస్తోంది. సదస్సు తర్వాత రోజే బాట ఉంటే నేతలు అక్కడకు వెళ్లేందుకు ఇబ్బందవుతుందని కిరణ్‌కు బొత్స చెప్పారట. అయితే ఇందిరమ్మ బాట కార్యక్రమం ఎప్పుడో ఖరారైందని దీనిని మార్చేది లేదని కిరణ్ ఖరాఖండిగా చెప్పారట.

English summary
CM Kiran Kumar Reddy has rejected PCC chief Botsa Satyanarayana's appeal on Indira Bata programme.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X