అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పరిటాల శ్రీరామ్ లొంగుబాటుపై పుకార్లు, కోర్టువద్ద భద్రత

By Srinivas
|
Google Oneindia TeluguNews

Paritala Sriram
అనంతపురం: దివంగత తెలుగుదేశం పార్టీ నేత పరిటాల రవీంద్ర తనయుడు పరిటాల శ్రీరామ్ లొంగిపోతారనే ఊహాగానాలు జిల్లా వ్యాప్తంగా వినిపిస్తున్నాయి. శ్రీరామ్ ధర్మవరం కోర్టులో లొంగిపోతారనే పుకార్లు జోరుగా వినిపిస్తుండటంతో కోర్టు వద్ద భారీగా పోలీసులను మోహరించారు. జిల్లా కాంగ్రెసు పార్టీ నేత పైన హత్యాయత్నం కుట్ర కేసులో ధర్మవరం పోలీసులు పరిటాల శ్రీరామ్ పైన కేసు నమోదయిందయిన విషయం తెలిసిందే.

అతని కోసం పోలీసులు ఈ రోజు ఉదయం గాలింపు చర్యలు చేపట్టారు. శ్రీరామ్ కోసం ఇంట్లో సోదాలు నిర్వహించారు. శ్రీరామ్ ఇంట్లో లేకపోవడంతో అతని బంధువుల ఇళ్లల్లో కూడా పోలీసులు తనిఖీలు చేశారు. పరిటాల శ్రీరామ్ కోసం సొంతూరు వెంకటాపురంను పోలీసులు జల్లెడ పట్టారు. పరిటాల నివాసం ఉండే అరవిందనగర్‌లోనూ గాలించారు. పరిటాల రవీంద్ర బాబాయ్ ఎల్ నారాయణ ఇంట్లోనూ సోదాలు నిర్వహించారు.

అనుమతి లేకుండా సోదాలు చేయడంపై రాప్తాడు శాసనసభ్యురాలు పరిటాల సునీత మండిపడ్డారు. అనుమతులు లేకుండా పోలీసులు ఎలా సోదాలు చేస్తారని ఆమె ప్రశ్నించారు. ముందస్తు సమాచారం లేకుండా సోదాలు నిర్వహించడం సరికాదన్నారు. తన భర్త పరిటాల రవి హత్యకు ముందు ఇలాగే ఇంట్లో సోదాలు చేశారని ఆమె గుర్తు చేశారు. తన తనయుడు పరిటాల శ్రీరామ్‌ను కొందరు కావాలనే ఇరికించే ప్రయత్నాలు చేశారని ఆరోపించారు.

కాంగ్రెసు నేత హత్యకు కుట్ర కేసులో పోలీసులు విచారణ కోసం పిలిస్తే తన తనయుడిని తాను వెంట తీసుకొని వెళతానని చెప్పారు. అనుమతి లేకుండా చేస్తున్న సోదాలపై తాను స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తానన్నారు. తాను మహిళా ఎమ్మెల్యేని అని కూడా చూడకుండా తన ఇంట్లో సోదాలు నిర్వహించడమేమిటన్నారు. తన ఇంట్లోనే కాకుండా తన మావయ్య ఇంట్లో కూడా సోదాలు చేస్తున్నారన్నారు.

ఇందులో రాజకీయ కుట్ర ఉందన్నారు. వారిని ఫాక్షన్ రాజకీయాలకు దూరంగా పెంచుతున్నానని, శ్రీరామ్ చదువుల కోసం విదేశాలకు వెళ్లే సమయంలో ఇలా చేస్తున్నారని, ఎస్పీతో మాట్లాడతామనుకున్నా ఆయన లైన్లోకి రావడం లేదన్నారు. కాగా శ్రీరామ్ పైన ధర్మవరం పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైన విషయం తెలిసిందే. మూడు బృందాలుగా చీలిన దాదాపు ముప్పై మంది పోలీసులు ఈ సోదాల్లో పాల్గొన్నారు. శ్రీరామ్ అజ్ఞాతంలో ఉన్నట్లుగా భావిస్తున్నారు.

సోదాలపై అనంతపురం డిఎస్పీ షాన్ వాజ్ ఖాసీం కూడా వివరణ ఇచ్చారు. తాము శ్రీరామ్ కోసమే సోదాలు నిర్వహిస్తున్నామని డిఎస్పీ అన్నారు. కాంగ్రెసు నేత హత్య కేసు కుట్రలో అతనిపై అభియోగాలు ఉన్నాయని చెప్పారు. శ్రీరామ్ పరారీలో ఉన్నట్లుగా ఆయన అభిప్రాయపడ్డారు. సునీత, ఆమె బంధువుల ఇళ్లలో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. శ్రీరామ్ విదేశాలకు వెళ్తారనే సమాచారం తమకు ఉందన్నారు.

అతను విదేశాలకు వెళ్లకుండా అన్ని విమానాశ్రయాలకు సమాచారాన్ని అందించినట్లు చెప్పారు. శ్రీరామ్‌ను ఏ క్షణమైనా పట్టుకుంటామని చెప్పారు. మూడు బృందాలతో శ్రీరామ్ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. అవసరమైతే కర్నాటకలోనూ సోదాలు నిర్వహిస్తామన్నారు. నేరస్తుల కోసం తనిఖీలు చేసే అధికారం తమకు ఉందన్నారు.

నిందితుల సమాచారం మేరకే శ్రీరామ్ పైన అభియోగాలు ఉన్నాయన్నారు. కేసులో ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవన్నారు. కాగా పోలీసులు ఎట్టి పరిస్థితుల్లోనూ పరిటాల శ్రీరామ్‌ను అరెస్టు చేయాలనే ఉద్దేశ్యంతో ఉన్నారు. ప్రస్తుతానికి వెంకటాపురంలో సోదాలు పూర్తయ్యాయి.

English summary
The rumors are spreading all over district that Paritala Sriram may surrender in Dharmavaram court.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X