హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాబుకు షాక్: జగన్ పార్టీలోకి మాజీ ఎమ్మెల్యే చింతల

By Pratap
|
Google Oneindia TeluguNews

YSR Congress
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు సొంత జిల్లా చిత్తూరులో షాక్ తగిలింది. చిత్తూరు జిల్లాకు చెందిన తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డి వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి చేరుతున్నారు. దాంతో ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు తెలుగుదేశం పార్టీ తెలిపింది.

రామచంద్రారెడ్డి గురువారం చంచల్‌గూడ జైలుకు వెళ్లి వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని కలిశారు. వైయస్సార్ కాంగ్రెస్‌లో చేరేందుకు ఆయన నిర్ణయించుకోవడంతో పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఖమ్మం జిల్లాలో ఈ నెల 11న చంద్రబాబు అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ విస్తృత సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో అభ్యర్థుల ఎంపికపై చర్చ జరుగుతుందని పార్టీ నాయకులు తెలిపారు.

కొన్ని నియోజక వర్గాల్లో ఇన్‌చార్జిలనే అభ్యర్థులుగా ప్రకటించాలని నిర్ణయించారు. వివాదం లేని నియోజక వర్గాలలో ఇన్‌చార్జిలను అభ్యర్థులుగా ప్రకటించాలనే ఆలోచనలో ఉన్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.
మహిళా సమస్యలపై సమావేశం ఢిల్లీ అత్యాచారంపై 6న ఎన్టీఆర్ భవన్‌లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్టు తెలుగు మహిళా అధ్యక్షురాలు శోభాహైమవతి తెలిపారు.

మహిళలపై పెరుగుతున్న అత్యాచారాలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్టు తెలిపారు. 9న చంద్రబాబు పాదయాత్ర చేపట్టి వంద రోజులు పూర్తవుతున్న, సందర్భంగా బిసి విభాగం ఆధ్వర్యంలో కుల వృత్తులను బాబు పాదయాత్రలో ప్రదర్శించాలని నిర్ణయించారు.

English summary
Telugudesam party ex MLA Chintala Ramachandra has decided to jump into YS Jagan's YSR Congress. He was suspended from Telugudesam party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X