హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాలికకు టీచర్ అసభ్య మెసేజ్‌లు: ప్రొఫెసర్ వెకిలి చేష్టలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Molesting teacher held
హైదరాబాద్/భోపాల్: ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఓ ఉపాధ్యాయుడు పైన కేసు నమోదయింది. కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు కార్పోరేషన్(కెపిహెచ్‌‍బి) పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. దాదాపు రెండు నెలలుగా టీచర్ తీరుపై యాజమాన్యానికి అనుమానం వచ్చి నిఘా పెట్టింది. తల్లిదండ్రులకు సమాచారం అందించింది. గురువారం బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదయింది.

నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు జిల్లాకు చెందిన బాధితురాలు ఓ ప్రయివేటు పాఠశాలలో చదువుతోంది. గోపీచంద్ అనే వ్యక్తి నాలుగు నెలల క్రితం ఈ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా చేరాడు. బాలికతో చనువు పెంచుకొని ఆటల పేరుతో ఆమెను పలు ప్రాంతాలకు తీసుకెళ్లేవాడు. ఆమె సెల్ ఫోన్‌కు అసభ్య సందేశాలు పంపిస్తుండేవాడు. ఆయన తీరును గమనించిన ప్రిన్సిపల్ నిఘా పెట్టి అతడి బాగోతాన్ని బయటపెట్టింది.

జూనియర్ డాక్టర్‌తో ప్రొఫెసర్ అసభ్య ప్రవర్తన

ఉస్మానియా ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ పట్ల ఓ ప్రొఫెసర్ అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపిస్తూ గురువారం జూనియర్ డాక్టర్లు విధులు బహిష్కరించి ఆందోళన బాట పట్టారు. ప్రొఫెసర్‌ను వెంటనే బాధ్యతల నుంచి తప్పించాలని పట్టుబట్టారు. సూపరిండెంట్‌ను ఘెరావ్ చేశారు. అతనిని బదిలీ చేసేందుకు రంగం సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. అయితే తాను ఎలాంటి తప్పు చేయలేదని ప్రొఫెసర్ చెబుతున్నారు.

తండ్రీ కొడుకుల ఘాతుకం

మధ్యప్రదేశ్‌లో ఓ తండ్రి కొడుకులు కామంతో కళ్లు మూసుకుపోయి ఓ బాలికను అపహరించి నాలుగు నెలలుగా అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఆగస్టు 29 నుండి తెహ్రా గ్రామానికి చెందిన బాలిక కనిపించకుండా పోయింది. బుధవారం అకస్మాత్తుగా తల్లిదండ్రుల ముందుకు వచ్చింది. తనపై నలుగురు వ్యక్తులు నాలుగు నెలలు నిర్బంధించి అత్యాచారం చేశారని ఆమె పోలీసులకు తల్లిదండ్రుల సహాయంతో ఫిర్యాదు చేసింది. తుపాకితో బెదిరించి తన కుమార్తెను అపహరించారని బాధితురాలి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.

English summary
A school teacher, who harassed a class 8 girl by sending vulgar messages to her phone, was arrested by the KPHP police on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X