హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

2గం.వరకు కిషన్‌రెడ్డి డెడ్‌లైన్: ఓయు విద్యార్థికి గాయం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kishan Reddy
హైదరాబాద్: సమర దీక్ష పైన రాష్ట్ర ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి రెండు గంటల వరకు డెడ్ లైన్ విధించారు. ప్రభుత్వం ఇందిరాపార్కు వద్ద సమర దీక్షకు అనుమతించక పోవడం సరికాదని ఆయన అన్నారు. రెండు గంటల వరకు తాము ప్రభుత్వానికి అనుమతి కోసం సమయం ఇస్తున్నామని, ఆ తర్వాత ఇందిరాపార్కులోకి దూసుకెళ్తామని హెచ్చరించారు.

పోలీసులు సమర దీక్షకు అనుమతించక పోవడంతో కిషన్ రెడ్డి సహా పలువురు నేతలు, కార్యకర్తలు, తెలంగాణవాదులు బర్కత్‌పురాలోని నగర పార్టీ కార్యాలయంలో దీక్షకు దిగారు. మరోవైపు జెఏసి కార్యాలయంలో తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ దీక్షకు దిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ప్రభుత్వం సమర దీక్షకు అనుమతించాలని విజ్ఞప్తి చేశారు.

అనుమతి కోసం చర్చించేందుకు ఎమ్మెల్సీ చుక్కా రామయ్య తదితరులు హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డితో చర్చించేందుకు వెళ్లారని కోదండరామ్ చెప్పారు. దీక్షకు అనుమతిపై నిర్ణయం చెబుతామని హోంమంత్రి చెప్పారన్నారు. చుక్కా రామయ్య, గద్దర్ తదితరులు సబితా ఇంద్రారెడ్డితో భేటీ అయ్యారు. అనుమతి ఇప్పించేందుకు వారు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఓయు గేటు వద్ద విద్యార్థి తలకు గాయం

రాజ్ భవన్ ముట్టడికి ర్యాలీగా బయలుదేరిన ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థుల బైక్ ర్యాలీ ఉద్రిక్తతకు దారి తీసింది. విద్యార్థులు రాళ్లు రువ్వండంతో పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. దీంతో ఎన్‌సిసి గేటు వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఓ విద్యార్థి తలకు రాయి తగిలి గాయమైంది. రాజ్ భవన్ ముట్టడికి బయలుదేరిన మరికొంతమంది విద్యార్థులను పోలీసులు ఖైరతాబాద్ చౌరస్తాలో అడ్డుకున్నారు. వారిని అదుపులోకి తీసుకున్నారు.

English summary
BJP state president Kishan Reddy has put deadline to Kiran Kumar Reddy's government on Samara Deeksha permission.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X