వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాకు అలాగే ఉంది, ముగిసిపోలేదు: తెలంగాణపై షిండే

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sushil Kumar Shinde
న్యూఢిల్లీ: తెలంగాణపై సంప్రదింపులు అవసరమని, వాటిని తాము కొనసాగిస్తున్నామని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే సోమవారం చెప్పారు. ఢిల్లీలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణపై సంప్రదింపుల ప్రక్రియ కొనసాగుతోందన్నారు. తెలంగాణపై చర్చలకు ఎలాంటి తుది గడువు లేదని ఆయన తేల్చి చెప్పారు. తెలంగాణపై ఇప్పుడప్పుడే నిర్ణయం తీసుకోవడం సాధ్యం కాదన్నారు. తెలంగాణపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని మాకు ఉందని కానీ, ఈ అంశం ఇంకా ముగిసిపోలేదన్నారు.

అఫ్జల్ ఉరి కుటుంబానికి తెలియజేశాం

పార్లమెంటు దాడి ఘటనలో నిందితుడు అఫ్జల్ గురును ఉరి తీసే విషయాన్ని ఆయన కుటుంబానికి తాము ముందే సమాచారమందించామని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే సోమవారం చెప్పారు. సమాచారం అందలేదని ఆయన కుటుంబ సభ్యులు చెప్పడం సరికాదన్నారు. ఈ నెల 7వ తేదిన స్పీడు పోస్టులో సమాచారం అందించామన్నారు. హిందూ టెర్రరిజం గురించి పలు సందర్భాల్లో తాను స్పష్టంగా చెప్పానని అన్నారు.

రాజీవ్ గాంధీ, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రుల హత్య కేసు దోషుల గురించి ప్రస్తావించిన జమ్ము కాశ్మీర్ ముఖ్యమంత్రి ఓమర్ అబ్దుల్లా వ్యాఖ్యలను షిండే ఖండించారు. అఫ్జల్ గురు ఉరిని ఓమర్ తప్పు పట్టిన విషయం తెలిసిందే. దీనిపై విలేకరులు ప్రశ్నించినప్పుడు.. అఫ్జల్ ఉరి విషయాన్ని తానే స్వయంగా ఈ నెల 8వ తేదిన ఓమర్‌కు చెప్పానని షిండే చెప్పారు. అఫ్జల్ కుటుంబానికి కూడా సమాచారమందించామన్నారు.

రాజీవ్, పంజాబ్ మాజీ సిఎంల కేసులు సుప్రీం కోర్టులో ఉన్నాయని చెప్పారు. అలాంటప్పుడు ప్రభుత్వం ఎలా నిర్ణయం తీసుకుంటుందని అభిప్రాయపడ్డారు. అఫ్జల్ గురు, అజ్మల్ కసబ్‌ల ఉరి రాజకీయపరమైన నిర్ణయాలు కావన్నారు. చట్టం సూచనల మేరకు, నిబంధనల ప్రకారమే ఉరితీత జరిగిందన్నారు. అఫ్జల్ గురు అంశం సున్నితమైనదన్నారు. అప్జల్ గురు విషయంలో చట్టం తన పని తాను చేసుకు పోయిందన్నారు.

English summary
Central Home Minister Sushil Kumar Shinde said on Monday that there is no dead line on Telangana issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X