జగన్ సాక్షి కార్యాలయంపై టిడిపి దాడి, అద్దాలు ధ్వంసం

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వస్తున్నా మీకోసం పాదయాత్ర ప్రస్తుతం గుంటూరు జిల్లాలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. చంద్రబాబు తన పాదయాత్రలో వైయస్ జగన్ పైన, సాక్షి దిన పత్రిక పైన ధ్వజమెత్తుతున్నారు. చంద్రబాబు ఉసిగొల్పిన కారణంగానే తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు గుంటూరు సాక్షి కార్యాలయంపై దాడి చేశారని ఆరోపిస్తున్నారు.
సాక్షి కార్యాలయంపై దాడిని జర్నలిస్టు సంఘాలు ఖండించాయి. దాడికి ప్రధాన కారకుడు చంద్రబాబేనని, ఆయనను అరెస్టు చేసి కేసును నమోదు చేయాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ డిమాండ్ చేసింది. తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభంజనాన్ని చూసి బాబుకు భయం పట్టుకుందని, అందుకే రాజకీయంగా ఎదుర్కోలేక ఇలా చేస్తున్నారని ఆ పార్టీ తీవ్రంగా మండిపడింది.
దాడికి పాల్పడిన వారు ఎవరైనా ఉపేక్షించబోమని, కఠినంగా శిక్షిస్తామని గుంటూరు అర్బన్ ఎస్పీ తెలిపారు. గుంటూరులో సాక్షి దిన పత్రిక కార్యాలయంపై దాడిని రాష్ట్ర ఎలక్ట్రానికి మీడియా అధ్యక్షుడు చందూ జనార్ధన్ ఖండించారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications