హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వాలెంటైన్స్‌డే: అన్నాచెల్లెళ్లకు పెళ్లి! ప్రేమ వ్యవహారమే..

By Srinivas
|
Google Oneindia TeluguNews

VHP activists perform marriage of couple
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులో విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ కార్యకర్తలు పలు ప్రేమ జంటలకు పెళ్లిళ్లు చేశారు. ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డేను నిరసిస్తూ ప్రేమికులు బయట కనిపిస్తే పెళ్లి చేస్తామని ముందే హెచ్చరించారు. అన్నట్లుగానే వారు పలుచోట్ల పెళ్లిళ్లు చేశారు. అయితే కుషాయిగూడలో జరిగిన ఓ పెళ్లి వివాదానికి దారి తీసింది. దళ్ కార్యకర్తలు ఈ పెళ్లిని అన్నా చెళ్లెళ్లకు చేశారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

పెళ్లి చేసుకున్న రాజు, గౌతమిలు కజిన్స్. రాజుకు గౌతమి పిన్ని కూతురట. వీరికి దళ్ కార్యకర్తలు పెళ్లి చేశారు. అయితే, ఈ విషయం దళ్ కార్యకర్తలకు తెలియదు. రాజు, గౌతమిలు వ్యూహాత్మకంగా ఈ పెళ్లి చేసుకున్నట్లుగా భావిస్తున్నారు. వరుసకు అన్నా చెల్లెళ్లు అయినప్పటికీ వారు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారట. అయితే, అన్నాచెల్లెళ్లు అయినందున తల్లిదండ్రులు ఒప్పుకోలేదట.

దీంతో, వారు బజరంగ్ దళ్, విహెచ్‌పిల పిలుపును గమనించి వ్యూహాత్మకంగా వారికి కనిపించి పెళ్లి జరిగేలా ప్లాన్ చేశారట. వారు కుషాయిగూడలో ఓ గుడికి వెళ్లి వస్తుండగా బజరంగ్ దళ్ కార్యకర్తలు వారిని అడ్డగించి కౌన్సెలింగ్ నిర్వహించి అనంతరం పెళ్లి చేశారు.

తాము వరుసకు అన్నా చెల్లెళ్లమని చెప్పలేదట. దీంతో ప్రేమికులుగా భావించి దళ్ కార్యకర్తలు వారి పెళ్లి చేశారు. రాజు, గౌతమిల పెళ్ళిపై బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు స్థానిక పోలీసు స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. అయితే, తాము ఇష్టపూర్తిగా పెళ్లి చేసుకున్నామని రాజు, గౌతమిలు చెప్పడం గమనార్హం.

English summary

 Bajrang Dal activists donned the roles of priests on Valentine's Day on Thursday by ‘performing' marriages of one lovers at Kushaiguda of Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X