వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విపరీతం: అఫ్జల్ ఉరిని ఖండిస్తూ పాక్ తీర్మానం

By Pratap
|
Google Oneindia TeluguNews

Afzal Guru
ఇస్లామాబాద్: భారత పార్లమెంటుపై దాడి కేసులో ఉరి శిక్ష పడిన అఫ్జల్ గురు విషయంలో పాకిస్తాన్ పార్లమెంటు విపరీత ధోరణిని ప్రదర్శించింది. సమస్యను మరింత తీవ్రం చేసే పనికి పూనుకుంది. అఫ్జల్ గురు ఉరిని ఖండిస్తూ పాకిస్తాన్ పార్లమెంటు తీర్మానం చేసింది. అంతేకాకుండా అఫ్జల్ గురు మృతదేహాన్ని ఆయన కుటుంబ సభ్యులకు అప్పగించాలని ఆ తీర్మానంలో డిమాండ్ చేసింది.

మరో రెండు రోజుల్లో ఐదేళ్ల కాలపరిమితి ముగియనున్న దశలో జాతీయ అసెంబ్లీ లేదా దిగువ సభ ఆ తీర్మానం చేసింది. కాశ్మీర్‌పై ప్ర్తత్యేక పార్లమెంటరీ ప్యానెల్‌కు నేతృత్వం వహిస్తున్న జమైత్ ఉలేమా - ఎ -ఇస్లామ్ చీఫ్ మౌలానా ఫజ్లుర్ రెహ్మాన్ ఆ తీర్మానాన్ని ప్రతిపాదించారు.

పాకిస్తాన్ పార్లమెంటు అఫ్జల్ గురు ఉరితీతను ఖండించడమే కాకుండా ఉరితీత కారణంగా జమ్మూ కాశ్మీర్‌లో కల్పించిన పరిస్థితి పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. అప్జల్ గురును ఫిబ్రవరి 9వ తేదీన తీహార్ జైలులో ఉరితీసి అక్కడే సమాధి చేసిన విషయం తెలిసిందే. అఫ్జల్ గురు ఉరితీతతో జమ్మూ కాశ్మీర్‌లో నిరసనలు పెల్లుబుకుతున్నాయి.

పాకిస్తాన్ పార్లమెంటు చేసిన తీర్మానం దాంతో ఆగకుండా మరింత ముందుకు వెళ్లింది. కాశ్మీర్ వివాదంపై అంతర్జాతీయ సమాజం ప్రేక్షక పాత్ర వహించడం మంచిది కాదని, సమస్యకు పరిష్కారం కనుక్కునేందుకు ప్రయత్నించాలని పాకిస్తాన్ ఆ తీర్మానంలో కోరింది. జమ్మూ కాశ్మీర్‌లో చంపడాన్ని ఆపేయాలని, కాశ్మీర్ లోయలోని పట్టణాల నుంచి, నగరాల నుంచి సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని కూడా కోరింది.

ఖైదీలను విడుదల చేయాలని, నల్లచట్టాలను ఉపసంహరించుకోవాలని, కర్ఫ్యూను ఎత్తేయాలని పాకిస్తాన్ పార్లమెంటు కోరింది. అఫ్జల్ గురు మృతదేహాన్ని ఆయన కుటుంబ సభ్యులకు అప్పగించాలని జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్బుల్లా, ఇతర ప్రధాన రాజకీయ గ్రూపులు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. తన తీర్మానంతో పాకిస్తాన్ కాశ్మీర్‌లో పరిస్థితి మరింత విషమించేలా పాకిస్తాన్ చేసింది.

English summary
Igniting the ongoing diplomatic battle between India and Pakistan, the latter on Thursday, March 14 passed a resolution against Afzal Guru's hanging. Pakistan in its resolution asked India to return Guru's dead body to his family members in Kashmir.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X