వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ జగతిలో నిమ్మగడ్డ పెట్టుబడులపై ఐటి దృష్టి

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదారాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌మోహన్ రెడ్డికి చెందిన జగతి పబ్లికేషన్స్‌లో పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ పెట్టిన పెట్టుబడులపై ఆదాయం పన్ను (ఐటి) శాఖ దృష్టి పెట్టింది. 2012 - 2013 ఆర్థిక సంవత్సరానికి గాను జగతి పబ్లికేషన్స్ ఆదాయం పన్ను మదింపు చేయాల్సిన అవసరం ఉందని, నెలన్నర లోపు అది చేయకపోతే నష్టం జరుగుతుందని ఐటి శాఖ సిబిఐ కోర్టుకు తెలిపింది.

జగతి పబ్లికేషన్స్ పన్ను మదింపు కోసం వాన్‌పిక్ వ్యవహారంపై సిబిఐ దాఖలు చేసిన చార్జిషీట్‌ను తమకు ఇవ్వాలని కోరుతూ ఐటి శాఖ అధికారులు సిబిఐ కోర్టును కోరారు. దాంతో పాటు ఒప్పంద పత్రాలను, ఇతర నోట్ షీట్లను కూడా తమకు ఇవ్వాలని వారు కోరారు. అందుకు నాంపల్లిలోని సిబిఐ కోర్టు అనుమతించింది.

నిమ్మగడ్డ ప్రసాద్‌కు చెందిన వాన్‌పిక్ వ్యవహారంపై నిరుడు ఆగస్టు 13వ తేదీన చార్జిషీట్ దాఖలు చేశారు. వైయస్ జగన్ ఆస్తుల కేసులో ఇది నాలుగవ చార్జిషీట్. ఈ చార్జిషీట్‌ కోసం ఐటి శాఖ అధికారులు సిబిఐ అధికారులను సప్రదించారు. అయితే, కోర్టు అనుమతితో వాటిని తీసుకోవాలని సిబిఐ సూచించింది. దీంతో డిసెంబర్ 3వ తేదీన వాటి కోసం ఐటి శాఖ కోర్టును ఆశ్రయించింది.

వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం నుంచి ప్రయోజనం పొందిన వాన్‌పిక్ అందుకు ప్రతిఫలంగా వైయస్ జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారని సిబిఐ ఆరోపించింది. ఈ కేసులో నిమ్మగడ్డ ప్రసాద్ అలియాస్ మ్యాట్రిక్ ప్రసాద్‌ను సిబిఐ అరెస్టు చేసింది. ప్రస్తుతం ఆయన హైదరాబాదులోని చంచల్‌గుడా జైలులో ఉన్నారు. వైయస్ జగన్ కూడా చంచల్‌గుడా జైలులోనే ఉన్నారు. వాన్‌పిక్ వ్యవహారంలో దాఖలు చేసిన చార్జిషీట్‌లో సిబిఐ మంత్రి ధర్మాన ప్రసాదరావును నిందితుడిగా చేర్చింది.

English summary
Nampally CBI court permitted IT department to get chargesheet filed by CBI in Nimmagadda Prasad's Vanpic issue in YSR Congress president YS Jagan DA case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X