కొడాలికి బాద్‌షా ఎఫెక్ట్: కొరడాతో కొట్టుకున్నటిడిపి ఎంపి

ఈ నేపథ్యంలో గుడివాడలోని ఎమ్మెల్యే కొడాలి నానికి చెందిన థియేటర్‌లో ప్రదర్శిస్తున్న హీరో జూనియర్ ఎన్టీఆర్ బాద్ షా చిత్రాన్ని కూడా నిలిపివేయాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి చెందిన కఠారి థియేటర్ నాని థియేటర్ ఎదుట ధర్నాకు దిగారు. రాష్ట్రవ్యాప్తంగా అందరు బందు పాటిస్తుంటే సినిమాను ఎలా ప్రదర్సిస్తున్నారంటూ కఠారి వర్గం ఆందోళన చేపట్టింది. బాద్ షా చిత్ర ప్రదర్సనను నిలిపివేయాలని పట్టుబట్టింది.
కొరడాతో కొట్టుకున్న టిడిపి ఎంపి
విద్యుత్ సమస్యలపై రాష్ట్ర బందు, ఆందోళన నేపథ్యంలో చిత్తురు తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు శివ ప్రసాద్ వినూత్న నిరసన తెలిపారు. ఆయన కొరడాతో తనను తాను కొట్టుకొని నిరసన తెలిపారు. దేవుడా.. కాంగ్రెసు నుండి ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని రక్షించమంటూ ఆయన కొరడాతో కొట్టుకున్నారు.
సోనియా నుంచి, రాహుల్ నుంచి, కిరణ్ నుంచి, కుహానా కాంగ్రెసు నాయకుల నుంచి, అధిక ధరల నుంచి తమను రక్షించాలని ఆయన అన్నారు. ఓ దేవుడా తమను రక్షించమంటూ వేడుకున్నారు. ఈ సందర్భంగా ఆయన డప్పు కూడా కొట్టారు. రాష్ట్రాన్ని రక్షించమని తాను కోరుతున్నానని చెప్పారు.












Click it and Unblock the Notifications