వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెరాసలోకి టి - ఎంపీల జంప్‌లు: తేలిగ్గా అధిష్టానం

By Pratap
|
Google Oneindia TeluguNews

Rashid Alvi
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లోకి వెళ్లడానికి సిద్దపడిన తమ పార్టీ తెలంగాణ పార్లమెంటు సభ్యుల తీరును కాంగ్రెసు అధిష్టానం తేలిగ్గా తీసుకుంటోంది. వారు వెళ్లినా ఫరవాలేదనే పద్ధతిలో అధిష్టానం వ్యవహరిస్తున్నట్లు ఎఐసిసి అధికార ప్రతినిధి రషీద్ అల్వీ సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చేసిన వ్యాఖ్యలు తెలియజేస్తున్నాయి. ఎవరైనా ఎటైనా వెళ్లవచ్చునని రషీద్ అల్వీ తమ పార్టీ తెలంగాణ పార్లమెంటు సభ్యుల తీరుపై వ్యాఖ్యానించారు.

రాజ్యాంగం కల్పించిన హక్కుల ప్రకారం ఎవరు ఏ పార్టీలోకైనా వెళ్లవచ్చునని ఆయన అన్నారు. తెలంగాణపై తమ పార్టీ ఇప్పటి వరకు ఏ విధమైన నిర్ణయం తీసుకోలేదని ఆయన చెప్పారు. తెలంగాణ సున్నితమైన సమస్య అని, తగిన సమయంలో తెలంగాణపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని, పార్లమెంటు సభ్యుల ఒత్తిడికి తలొగ్గి నిర్ణయం తీసుకోలేమని ఆయన అన్నారు. తెరాసలోకి వెళ్లడానికి సిద్ధపడిన పార్లమెంటు సభ్యులతో మాట్లాడకూడదని కూడా పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

తెరాసలోకి వెళ్లడానికి సిద్ధపడిన పార్లమెంటు సభ్యులతో మాట్లాడుతారా అని అడిగితే తాము ఎవరితోనూ మాట్లాడబోమని, వారు వేరే పార్టీలోకి వెళ్లిన తర్వాత అధికారికంగా స్పందిస్తామని రషీద్ అల్వీ చెప్పారు. తమ పార్టీ పార్లమెంటు సభ్యులు తెరాసలోకి వెళ్లినా ఫరవాలేదనే పద్ధతిలో కాంగ్రెసు అధిష్టానం వ్యవహరిస్తోంది. కెసిఆర్‌తో తమ పార్టీ పార్లమెంటు సభ్యుల భేటీ వివరాలు తెలియవని రషీద్ అల్వీ అన్నారు.

తమ పార్టీలో చేరాలని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. కేశవరావు, మందా జగన్నాథం, రాజయ్య, జి. వివేక్‌లతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే, వారు ఇంకా ఏమీ తేల్చుకోలేదని చెబుతున్నారు.

సబిత చార్జిషీట్‌పై అజాద్ స్పందిస్తారు..

రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేరును వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ కేసులో నిందితురాలిగా చేర్చిన విషయంపై ఆ రాష్ట్ర కాంగ్రెసు వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ స్పందిస్తారని రషీద్ అల్వీ చెప్పారు. సిబిఐ స్వతంత్రంగానే వ్యవహరిస్తోందని ఆయన అన్నారు.

English summary
AICC spokesperson Rashid Alvi's statement indicates that the Congress high command decided to ignore its party MPs from Telangana, efforts to join in KCR's Telangana Rastra Samithi (TRS).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X