వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిడిపిలోకి తెలంగాణలో వలసలు: రాజారాం, చాడ సురేష్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Telugudesam Party
హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయ ఐక్యకార్యాచరణ సమితిలో క్రియాశీలకంగా పని చేసిన రాజారామ్ యాదవ్ ఈ నెల 25న తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. ఈ వారంలో టిడిపిలోకి ముగ్గురు ముఖ్యనేతలు చేరనున్నారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ నుంచి గత లోక్‌సభ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ టికెట్‌పై పోటీ చేసిన పోతుల విశ్వం 22న ఇక్కడ తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు.

పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆ జిల్లాలో పాదయాత్ర చేసినప్పుడు ఆయనను కలిసి విశ్వం మాట్లాడారు. అన్నీ అనుకూలిస్తే ఆయనను కాకినాడ ఎంపి అభ్యర్థిగా పెట్టాలని టిడిపి యోచిస్తోంది. ఆయన ప్రముఖ విద్యాసంస్థల అధినేత. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన రాజారామ్ యాదవ్ కూడా టిడిపి తీర్థం పుచ్చుకోనున్నారు.

ఆయన ఇటీవల చంద్రబాబును కలిసి మాట్లాడి టిడిపిలో చేరాలని నిర్ణయించుకొన్నారు. ఆయన వచ్చే ఎన్నికల్లో నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ నియోజకవర్గంలో టిడిపి తరపున పోటీ చేయాలని భావిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్‌నగర్ నియోజకవర్గానికి చెందిన భారతీయ జనతా పార్టీ నేత మురళి 23న టిడిపిలో చేరనున్నారు.

వరంగల్ జిల్లా హన్మకొండ మాజీ పార్లమెంటు సభ్యుడు చాడ సురేష్ రెడ్డి కూడా టిడిపిలో చేరేందుకు రంగం సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఆయన ఇటీవలి వరకు తెరాసలో ఉన్నారు. చాడ సురేష్ రెడ్డి, మురళీ, రాజారామ్ యాదవ్‌తో పాటు మరికొందరు నేతలు టిడిపిలోకి వస్తారని ఆ పార్టీ చెబుతోంది.

English summary
Osmania University JAC leader Rajaram Yadava and BJP leader Murali will join in Telugudesam Party in this week.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X