వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీ బిల్లుకు సుష్మా డిమాండ్: సుప్రీంలో విభజనపై పిల్

By Pratap
|
Google Oneindia TeluguNews

Sushma Swaraj
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును ఈ పార్లమెంటు సమావేశాల్లోనే ప్రతిపాదించాలని బిజెపి సీనియర్ నేత సుష్మా స్వరాజ్ డిమాండ్ చేశారు. తెలంగాణకు బిజెపి అనుకూలంగా ఉందని, పార్లమెంటులో బిల్లు పెడితే మద్దతు ఇస్తామని ఆమె చెప్పారు. పార్లమెంటు సమావేశాలను పొడగించి తెలంగాణ బిల్లును ప్రతిపాదించాలని ఆమె అన్నారు. ప్రస్తుతం తెలంగాణలో ప్రశాంత వాతావరణం ఉందని, బిల్లు పెడితే సీమాంధ్రలో కూడా పరిస్థితులు చక్కబడుతాయని ఆమె అన్నారు.

కాంగ్రెసు పార్టీ వల్లనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనిశ్చితి ఏర్పడిందని ఆమె అన్నారు. విభజన జరిగేటప్పుడు స్పష్టంగా ఉండాల్సిన అవసరం ఉందని సుష్మా స్వరాజ్ అభిప్రాయపడ్డారు. పార్లమెంటు సమావేశాలు సజావుగా జరగకపోవడానికి కాంగ్రెసు పార్టీయే కారణమని ఆమె విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలతో కాంగ్రెసు నాటకాలు ఆడుతోందని ఆమె వ్యాఖ్యానించారు.

ఆంధ్రప్రదేశ్ విభజనపై సుప్రీంకోర్టులో మరో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం (పిల్) దాఖలైంది. మాజీ శాసనసభ్యుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు అడుసుమిల్లి జయప్రకాశ్ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాతే రాష్ట్ర విభజన ప్రక్రియ కొనసాగాలని కోరుతూ ఆయన ఈ పిటిషన్ వేశారు.

రాష్ట్రాన్ని విభజించాలని నిర్ణయించారే గాని దాని ఫలితంగా తలెత్తే సమస్యలను ఎలా పరిష్కరిస్తారో కేంద్ర ప్రభుత్వం చెప్పలేదని అంటూ వెంటనే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ఆయన కోరారు. రాష్ట్ర విభజనపై రెండో ఎస్సార్సీ వేయవలసిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కూడా ఆయన సుప్రీం కోర్టును ఈ పిటిషన్‌లో అభ్యర్థించారు.

ఈ అంశంపై శుక్రవారంనాడు సుప్రీంకోర్టులో పీవీ రమణ అనే న్యాయవాది గురువారంనాడు ఒక ప్రజా వ్యాజ్యాన్ని (పిల్)ను దాఖలు చేశారు. రాష్ట్ర విభజన ప్రతిపాదన రాజ్యాంగంలోని 321-డి అధికరణ ఉల్లంఘనే అని ఆయన అన్నారు.

English summary
BJP senior leader Sushma Swaraj suggested union government to propose Tealangana bill in the current Parliament session.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X