• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

టీ ప్రక్రియలో వేగం: నవంబర్‌లో రెండు రాష్ట్రాలు

|

న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను ఆలస్యం చేసే యోచనలో కేంద్రం లేనట్లు తెలుస్తోంది. శుక్రవారం జరిగే కేంద్ర కేబినెట్సమావేశంలో కేంద్ర హోంశాఖ తెలంగాణ రాష్ర్ట ఏర్పాటుకు ప్రతిపాదన చేయనున్నట్లు సమాచారం.

రాష్ట్ర విభజనపై కేంద్ర హోంశాఖ రూపొందించిన ప్రతిపాదనను కేంద్ర కేబినెట్లో చర్చించనున్నట్లు సమాచారం. అనంతరం ఆ ప్రతిపాదనను ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి పంపించనున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ప్రతిపాదనపై చర్చించితర్వాత సభ ఆమోదించినా..ఆమోదించకపోయినా తెలంగాణ రాష్ర్ట ఏర్పాటుకు కేంద్రం చర్యలు చేపట్టనున్నట్లు సమాచారం.

ak anotny

విభజనకు నిరసనగా సీమాంధ్రలో ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో అసెంబ్లీ కేంద్ర ప్రతిపాదనకు ఆమోదం లభించే అవకాశం లేకపోవచ్చు. దీనిపై కేంద్రం ముందే ప్రకటించిన విధంగా అసెంబ్లీ అభిప్రాయం నామమాత్రమే కావొచ్చు.సీమాంధ్ర జరుగుతున్న ఉద్యమాలకు ఆ ప్రాంత నేతలు మద్దతు పలికి ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. రాష్ర్ట విభజనను నిలిపేయాలని, లేదా హైదరాబాద్ ను ఉమ్మడి రాజధాని చేయాలనే డిమాండ్లూ వస్తున్నాయి.

కేంద్రం కూడా విభజన అంశానికి త్వరగా పరిష్కారం చూపాలని చూస్తోంది. హైదరాబాద్ పై వివాదం ఏర్పడిన నేపథ్యంలో..సీమాంధ్రలో రాజధాని ఏర్పాటుకు భారీ ప్యాకేజీ ఇచ్చేందుకు కేంద్రం కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నవంబర్ చివరి నాటికి రెండు రాష్ట్రాలు ఏర్పడి ఇద్దరు ముఖ్యమంత్రులు వస్తారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఒకరు చెప్పడం గమనార్హం.

2009లో లాగా వెనక్కి వెళ్లకుండా చూసుకోవాలనే స్థిరనిశ్చయంతో కాంగ్రెసు అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. సీమాంధ్రకు కొత్త రాజధాని ఏర్పాటయ్యే వరకు హైదరాబాదును ఉమ్మడి రాజధానిగా చేస్తారు. తెలంగాణలో 17 లోకసభ స్థానాలున్నాయి. రాష్ట్ర విభజన వల్ల తెలంగాణలో అత్యధిక లోకసభ స్థానాలను గెలుచుకోగలమని కాంగ్రెసు అధిష్టానం భావిస్తోంది.

జలపంపిణీలోనూ, విద్యుత్తు పంపకాల్లోనూ సవాళ్లు ఎదురు కావచ్చునని అంటున్నారు. అయితే, అది కూడా సమస్య కాదని, త్వరగా పూర్తి చేయడానికి అవసరమైన కసరత్తు జరిగిందని అంటున్నారు. అప్పులు విషయం మాట్లాడుతన్నప్పటికీ వాటిని ప్రాజెక్టులవారీగా కేటాయించే అవకాశం ఉంది. తెలంగాణలోని ప్రాజెక్టులకు తీసుకున్న అప్పులను తెలంగాణ రాష్ట్రానికి, సీమాంధ్రలోని ప్రాజెక్టులకు తీసుకున్న అప్పులను సీమాంధ్రకు కేటాయించే అవకాశం ఉంది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Centre is set to give a final push to the formation of Telangana after the end of the monsoon session of Parliament on Friday, with Union Cabinet's decision to divide Andhra Pradesh opening the door for a flurry of action on the fraught issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more