ఏపీలో కాస్త తగ్గిన కరోనా కేసులు..: 13 మంది మృతి
ఏపీలో కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 58,054 శాంపిల్స్ పరీక్షించగా, 1,010 కొత్త కేసులు వచ్చాయి. తూర్పుగోదావరి జిల్లాలో కొత్త కేసుల సంఖ్య తగ్గగా... చిత్తూరు జిల్లాలో పెరిగాయి. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 218 కేసులు వచ్చాయి. ఇదే సమయంలో రాయలసీమలోని మరో జిల్లా కర్నూలులో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.
గత 24 గంటల్లో 1,149 మంది కరోనా నుంచి కోలుకోగా... 13 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 20,50,324కి పెరిగింది. మొత్తం 20,24,645 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 14,176 మంది మృతి చెందారు. ప్రస్తుతం ఏపీలో 11,503 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

ఇటు వేసవిలోనే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. గతేడాది సమ్మర్‌లో కరోనా ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. థర్డ్‌వేవ్ పిల్లలకు అని ప్రచారం జరుగుతోంది. వచ్చే నెలలో అని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఆందోళన నెలకొంది. మరోవైపు వచ్చే ఏడాది సమ్మర్‌లో ఫోర్త్ వేవ్ అని కూడా అంటున్నారు. దీంతో కరోనా 5,6 ఏళ్లు ఉంటుందని అర్థం చేసుకోవచ్చు.
వానకాలం రావడంతో ఫంగస్ ఇంపాక్ట్ తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటివరకు బ్లాక్ ఫంగస్ ఇంపాక్ట్ కనిపించింది. మొత్తానికి కరోనాతో కలిసి బతకాల్సిందే.. అందుకోసం విధిగా మాస్క్ ధరించి.. శానిటైజర్ రాసుకుంటూ కాలం వెళ్లదీయాల్సిందే. రెండు డోసులతోపాటు బూస్టర్ డోస్ టీకా కూడా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం అయితే అందరికీ సెకండ్ డోసు ఇస్తున్నారు. ఇది పూర్తయితే దేశంలో చాలా మంది రెండు డోసులు తీసుకున్నట్టు అవుతుంది. దీంతోపాటు బూస్టర్ డోసు వేసుకోవాలని నిపుణులు సూచన చేస్తున్నారు.
ఇటు డేల్టా వేరియంట్ ఆందోళన కలిగిస్తోంది. డేల్టా ప్లస్ వేరియంట్ మరింత ప్రమాదకరం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. దీంతో కరోనా కోసం మరింత పకడ్బందీగా ఉండాల్సిందే. తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు థర్డ్ వేవ్ అని నిపుణులు చెప్పడంతో భయాందోళన నెలకొంది.












Click it and Unblock the Notifications