అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీ సేవా పోర్టల్ ప్రారంభం.. మరింత వేగంగా మెరుగైన సేవలు: సీఎం జగన్

|
Google Oneindia TeluguNews

జనానికి మరింత మెరుగైన సేవలను ఏపీ అందిస్తోంది. ఈ మేరకు వారికి అవసరమైన సేవలను అందజేస్తోంది. సిటిజన్ సర్వీస్ పోర్టల్‌ను సీఎం జగన్ ప్రారంభించారు. పోర్టల్‌కు ఏపీ సేవా పోర్టల్‌గా పేరు పెట్టారు. సిటిజన్ సర్వీసెస్ పోర్టల్ ద్వారా మరింత వేగంగా సేవలు అందుతాయని సీఎం జగన్ పేర్కొన్నారు. సామాన్యులకు మరిన్ని మెరుగైన సేవలు అందించేందుకే ఏపీ సేవా పోర్టల్ 2.0 ప్రారంభిస్తున్నామని చెప్పారు. గ్రామ స్వరాజ్యానికి ఈ పాలనకు మించిన ఉదాహరణ లేదన్నారు.

గ్రామ స్వరాజ్యం అంటే ఏమిటో రెండేళ్లుగా అమలు చేసి చూపించామని సీఎం జగన్ తెలిపారు. దరఖాస్తులపై భౌతికంగా సంతకం చేయడం ద్వారా ఉద్యోగులకు బాధ్యత పెరుగుతుందన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా 540కి పైగా సేవలు అందిస్తున్నామని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 15,004 గ్రామ, వార్డు సచివాలయాలు పనిచేస్తున్నాయని తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా 1.34 లక్షల మందికి ఉద్యోగవకాశాలు లభిస్తాయని వెల్లడించారు.

2.60 లక్షల మంది వాలంటీర్లు ఇంటింటికీ ప్రభుత్వ పథకాలను అందిస్తున్నారని తెలిపారు. మారుమూల గ్రామాలకు కూడా మరింత వేగంగా సేలు అందుతాయని చెప్పారు. ప్రజలకు అవసరమైన డాక్యుమెంట్ల కోసం ఆఫీసుల చట్టూ తిరగాల్సిన పనిలేదన్నారు. దరఖాస్తుల పరిష్కారం ఏ దశలో ఉందో ఎప్పటికప్పుడు ప్రజలకు తెలుస్తుందని తెలిపారు.

cm jagan launched ap service portal

Recommended Video

Andhra Pradesh : Complete List Of 13 New Districts In AP | Oneindia Telugu

ఎస్ఎంఎస్ ద్వారా అప్లికేషన్ల ప్రాసెసింగ్ సమాచారం అందుతుందన్నారు. ఏపీ సేవా పోర్టల్ ద్వారా రుసుము చెల్లించే వెసులుబాటు ఉందని తెలిపారు. ఆన్ లైన్ లోనే దరఖాస్తులను ఆమోదించే అవకాశం ఉంటుందన్నారు. అధికారులు, ఉద్యోగుల మధ్య సమన్వయం ఉంటుందని తెలిపారు. గ్రామ స్వరాజ్యానికి ఇదే నిదర్శనమని అన్నారు.

English summary
andhra pradesh chief minister ys jagan mohan reddy launched ap service portal. more fast services to common man cm jagan said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X