Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అయ్యో బాలయ్య.. నీ తిప్పలు ఏందయ్యా.. ఈసారి అల్లుడి దారి తొక్కారుగా..!

అమరావతి : హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ మళ్లీ తడబడ్డారు. సినిమా స్క్రీన్ మీద ఎంత పెద్ద డైలాగయినా అవలీలగా చెప్పే బాలయ్య .. క్షేత్రస్థాయిలో మాత్రం ఆపసోపాలు పడుతుంటారు. ఏదో మాట్లాడాలనుకుని ఇంకేదో మాట్లాడేస్తుంటారు. తెలుగే సరిగా పలకలేని బాలయ్య.. ఇక హిందీలో సగం సగం చెప్పే డైలాగులు వైరల్‌గా మారాయి.

అవన్నీ ఒకటయితే.. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయన మాట్లాడిన తీరుపై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు చక్కర్లు కొడుతున్నాయి. ఇన్నాళ్లు బాలయ్య స్టైల్లో ఆయన పలికిన డైలాగులతో తెగ నవ్వుకున్న నెటిజన్లు ఇప్పుడు మామ అల్లుడి దారి తొక్కారుగా అంటూ కామెంటుతున్నారు.

బాలయ్య.. అల్లుడి దారి తొక్కారుగా..!

బాలయ్య.. అల్లుడి దారి తొక్కారుగా..!

నందమూరి బాలక‌ృష్ణ సిల్వర్ స్క్రీన్‌పై ఎంతటి భారీ డైలాగులైనా అవలీలగా చెప్పేస్తారు. కానీ జనాల్లోకి వచ్చేసరికి ఎందుకోగానీ తడబడతారు. తాజాగా ఆయన మరోసారి తత్తరపాటుకు లోనయ్యారు. మంగళవారం నాడు దివంగత ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని హిందూపురం నియోజకవర్గంలో వేడుకలు నిర్వహించారు. ఆ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ తడబడ్డారు. ఎన్టీఆర్ జయంతిని కాస్తా వర్ధంతిని చేసేశారు.

బాలయ్య తత్తరపాటుతో అల్లుడు నారా లోకేశ్‌ను మించిపోయారంటూ సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు. గతంలో ఒకానొక సందర్భంలో లోకేశ్ కూడా ఇలాగే మాట్లాడటంతో జయంతికి, వర్ధంతికి తేడా తెలియదా అంటూ సోషల్ మీడియా కోడై కూసింది. ఇప్పుడు బాలయ్య అదే తీరుగా మాట్లాడటంతో అల్లుడితో పోల్చేస్తున్నారు.

 సోదరుడు చనిపోతే సంభ్రమాశ్చర్యాలు.. ఎన్నికల ప్రచారంలో బుల్ బుల్ సితార

సోదరుడు చనిపోతే సంభ్రమాశ్చర్యాలు.. ఎన్నికల ప్రచారంలో బుల్ బుల్ సితార

నందమూరి హరిక‌ృష్ణ యాక్సిడెంట్‌లో చనిపోయిన సందర్భంలో.. సోదరుడి మరణానికి చింతిస్తూ బాలయ్య మాట్లాడిన తీరు వైరల్ అయింది. ఏదో అనబోయి ఇంకేదో అనేసరికి నెట్టింట్లో అయ్యో బాలయ్య అంటూ కామెంట్ల వర్షం కురిసింది. సంభ్రమాశ్చర్యాలకు గురయ్యానంటూ వ్యాఖ్యానించడంతో బాలయ్య, ఏందయ్యా అంటూ నెటిజన్లు రకరకాలుగా స్పందించారు.

ఇక తెలంగాణ ముందస్తు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం వేళ బాలయ్య బాబు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. బోయిన్‌పల్లి చౌరస్తాలో మహాకూటమి అభ్యర్థికి ప్రచారం చేసిన బాలయ్య పడ్డ తిప్పలు అన్నీ ఇన్నీ కావు. అసందర్భంగా ఏదో పేల్చాలనుకున్న డైలాగ్ రివర్స్ కొట్టింది. సారే జహాసె అచ్ఛా.. హిందుస్తాన్ హమారా అంటూ గళమెత్తిన బాలయ్య స్వరం తత్తరపాటుకు లోనయింది. అలా చాలాసేపు అదే ఉచ్ఛరిస్తూ చివరకు ఏదో చెప్పాలని హే బుల్ బుల్.. హే బుల్ బుల్ సితారా అంటూ ముగించారు. ఇక అప్పటినుంచి నెటిజన్లంతా బుల్ బుల్ బాలయ్య అంటూ పేరు పెట్టేశారు. అది నామధ్యేయం ఇప్పటికీ కొనసాగుతుండటం గమనార్హం.

తెలుగు చాలదన్నట్లు.. హిందీ భాష ప్రావీణ్యం కూడానా?

తెలుగు చాలదన్నట్లు.. హిందీ భాష ప్రావీణ్యం కూడానా?

తెలుగులోనే సరిగా పలకలేని బాలయ్య చాలా సందర్భాల్లో ఇలాగే తిప్పలు పడ్డారు. ఆ మధ్య ప్రత్యేక హోదా గురించి సరిగా మాట్లాడలేని పరిస్థితిలో అభాసుపాలయ్యారు. ఏదైనా తెలియకుంటే దాని గురించి కట్ చెప్పకుండా ఇంకేదో చెప్పాలనే ఆరాటంలో పాపం ఇలా అడ్డంగా బుక్కవుతున్నారు. ఇక తన భాషా నైపుణ్యం చాలదన్నట్లు హిందీ భాషను ప్రయోగించి కామెడీ స‌ృష్టించారు.

ఆ మధ్య వచ్చీరాని హిందీలో ప్రధాని నరేంద్రమోడీని బెదిరిస్తున్నట్లుగా వైరల్ అయిన వీడియోలో బాలయ్య తిప్పలు అన్నీ ఇన్నీ కావు. ఈ మధ్య హిందూపురం నుంచి ఆయన మరోసారి ఎమ్మెల్యేగా గెలిచాక.. బుల్ బుల్ బాలయ్య మళ్లీ వచ్చాడురో అంటూ నెట్టింట్లో కామెంట్లు చక్కర్లు కొట్టాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+