ఏపీలో మూడురోజులు వర్షాలు.. ఉరుములు, మెరుపులు
అల్పపీడన ద్రోణి బలహీన పడింది. దీంతోపాటు ఉక్కపోత కూడా ఎక్కువగా ఉంది. అల్పపీడన భావంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రాష్ట్రంలో పశ్చిమ, నైరుతి దిశల నుంచి గాలులు వీస్తున్నాయని చెప్పారు. ఏపీలో వచ్చే మూడు రోజులకు సంబంధించి వాతావరణ వివరాలను అధికారులు ప్రకటించారు.
ఇవాళ, రేపు ఉత్తర కోస్తాంధ్రలో ఉరుములు, మెరుపులుతోపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి ఉత్తర కోస్తాంధ్రాలో ఉరుములు, మెరుపులు తోపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాంధ్రాలో ఇవాళ, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరికొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు.

దక్షిణ కోస్తాంధ్రాలో మంగళవారం ఉరుములు, మెరుపులతోపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందన్నారు. ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. రాయలసీమ ప్రాంతంలో ఇంచుమించు ఇదేవిధంగా వాతావరణ పరిస్థితులు ఉంటాయన్నారు. ఇవాళ, రేపు రాయలసీమలో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు. మంగళవారం రోజున మాత్రం ఉరుములు, మెరుపులతో పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కొన్ని చోట్ల కురుస్తాయని వెల్లడించారు.
Recommended Video
ఉరుములు, మెరుపు వచ్చే సమయంలో ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని సూచించారు వాతావరణ శాఖ అధికారులు. సురక్షితమైన ప్రాంతాల్లో తలదాచుకోవాలని కోరారు. ఇటు తెలంగాణ రాష్ట్రంలో కొన్నిచోట్ల ఆకాశం మేఘావృతమై ఉంది. ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్నారు. వర్షం కురిసే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications