టీడీపీ.. కొట్టేసింది: తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్‌గా: మైదుకూరులో వైసీపీ: జనసేన కీలకం

అనంతపురం: రాష్ట్రవ్యాప్తంగా ఇటీవలే ముగిసిన మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల ఫలితాల్లో అందరి దృష్టినీ ఆకర్షించిన పేర్లు.. తాడిపత్రి, మైదుకూరు. రాయలసీమలోని ఈ రెండు మున్సిపాలిటీలు హంగ్‌గా ఏర్పడ్డాయి. ఏ ఒక్క పార్టీకి కూడా పూర్తిస్థాయి మెజారిటీ లభించలేదు. పాలక వర్గాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ దక్కలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం రాష్ట్రవ్యాప్తంగా కొనసాగినప్పటికీ.. ఈ రెండు చోట్ల టీడీపీని అడ్డుకోలేకపోయింది. ఆ పార్టీ కంటే తక్కువ సంఖ్యలో వార్డులను గెలుచుకోగలిగింది.

తాజాగా- ఎక్స్ అఫీషియో ఓట్ల ద్వారా ఈ రెండు మున్సిపాలిటీలను కైవసం చేసుకోవాలనుకున్న అధికార పార్టీకి మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. తాడిపత్రి మున్సిపాలిటీపై పసుపు జెండా ఎగిరింది. మున్సిపల్ ఛైర్మన్‌గా టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి నియమితులయ్యారు. ఆయన ఎన్నికను ప్రిసైడింగ్ అధికారి జీఆర్ మధుసూదన్ ప్రకటించారు. వైస్ ఛైర్మన్ స్థానాన్ని కూడా టీడీపీనే గెలుచుకుంది. వైస్ ఛైర్ పర్సన్‌గా పీ సరస్వతి నియమితులయ్యారు.

Anantapur: former TDP MLA JC Prabhakar Reddy elect as Municipal Chairman of Tadipatri

వైసీపీ మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థి సయ్యద్ భాషాకు 18 ఓట్లు పోల్ అవ్వగా.. టీడీపీ అభ్యర్థి జేసీ ప్రభాకర్ రెడ్డికి 21 ఓట్లు పడ్డాయి. పాలక మండలిని ఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 20. ఆ సంఖ్యను టీడీపీ అందుకోవడం వల్ల టీడీపీ విజయం సాధించినట్లుగా ప్రిసైడింగ్ అధికారి మధుసూదన్ ప్రకటించారు. కాగా- హంగ్ ఏర్పడిన మైదుకూరు మున్సిపాలిటీని వైసీపీ కైవసం చేసుకోగలిగింది.
చైర్మన్ పదవి దక్కించుకుంది. చైర్మన్‌గా మాచనూరు చంద్ర, వైస్ ఛైర్మన్ గా మహబూబ్ షరీఫ్ ఎన్నికయ్యారు. వారితో కమిషనర్ ప్రమాణ స్వీకారం చేయించారు.

Anantapur: former TDP MLA JC Prabhakar Reddy elect as Municipal Chairman of Tadipatri

ఈ మున్సిపాలిటీ పరిధిలో తెలుగుదేశం పార్టీ నుంచి 12 మంది వైసీపీ నుంచి 11 మంది విజయం సాధించారు. ఒక స్థానాన్ని జనసేన గెలుచుకుకుంది. ఛైర్మన్ ఎన్నిక కార్యక్రమానికి టీడీపీ నుంచి 11 మంది మాత్రమే హాజరయ్యారు. వైసీపీకి చెందిన కడప లోక్‌సభ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి, అదే పార్టీకి చెందిన మైదుకూరు శాసన సభ్యుడు రఘువీరా రెడ్డి ఎక్స్అఫిషియో సభ్యులుగా హాజరయ్యారు. వారి ఓట్లతో వైసీపీ మున్సిపల్ ఛైర్మన్ స్థానాన్ని తన ఖాతాలో వేసుకోగలిగింది. జనసేన నుంచి గెలిచిన వార్డు సభ్యుడు తటస్థంగా నిలిచారు. ఏ పార్టీకీ ఆయన మద్దతు ప్రకటించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+