ఆర్ట్స్ కాలేజీలో గ్యాంగ్ వార్... గ్రౌండ్‌లో కొట్టుకున్న విద్యార్థులు...!

విద్యార్థులన్నాక కొట్టుకోవాలనుకున్నారో ఏమో... మారుతున్న విద్యా వ్యవస్థలో కూడ ఇంకా కాలేజీల్లో గ్యాంగ్ వార్‌లు కొనసాగుతున్నాయి.. ఒకరినొకరు కొట్టుకుంటూ తమ జీవత లక్ష్యాన్ని మరచిపోతున్న సంఘటనలు ఇంకా కొనసాగుతున్నాయి..ఈనేపథ్యంలోనే గ్యాంగ్ వార్‌లపై కాలేజీ యాజమాన్యాలు కూడ పట్టించుకోక పోవడంతో రెండు వర్గాల వారు కాలేజీ గ్రౌండ్‌లోనే కొట్టుకున్న సంఘటనలు పునరావృతమవుతున్నాయి.

అనంతపురం ఆర్ట్స్ కాలేజీలో కాలేజీ విద్యార్థుల మధ్య గ్యాంగ్ వార్ కొనసాగింది. సహా విద్యార్థిపై ఇతర విద్యార్థులు దాడులు చేశారు. అయితే ఆ విద్యార్ధుల దాడిలో గాయపడ్డ సహ విద్యార్థి క్రిందపడి పోయాడు. దీంతో ఆ విద్యార్థిని బెల్టుతో చితకబాదారు. మరోకరు విపరీతంగా కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో హచ్‌చల్ చేస్తుంది.అయితే ఆర్ట్స్ కాలేజీలోని కామర్స్ భవనం ముందు ఉన్న గ్రౌండ్‌లో ఈ వార్ కొనసాగింది.కాగా గత కొద్ది రోజులుగా రెండు వర్గాల స్టూడెంట్ గ్రూపుల మధ్య వార్ కొనసాగుతున్నట్టు తెలిపారు.అయితే విద్యార్థుల వివాదం పై కాలేజీ ప్రిన్సిపల్ గాని ఇతర ఉపాధ్యాయులు గాని ఎవరు పట్టించుకోకపోవడంతో వివాదం ముదిరి బహిరంగంగా కొట్టుకునే పరస్థితి నెలకొందని పలువురు విద్యార్థులు వాపోయారు.

Gang war between college students at Anantapur Arts College

కాగా ఈ సంఘటన గత వారం రోజుల తర్వాత బయటకు రావడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా గాయపడ్డ విద్యార్థి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+