వైసీపీ ఎమ్మెల్యే షాకింగ్- జగన్ ఇన్ని అబద్దాలా ? రాజకీయ లబ్ది కోసం ఏం మాట్లాడతారో తెలియదంటూ

ఏపీలో అధికార వైసీపీలో పార్టీ అధినేత కమ్ సీఎం జగన్ గురించి మాట్లాడాలంటే సొంత పార్టీ నేతలు ఆచితూచి మాట్లాడుతుంటారు. స్వోత్కర్ష అయితే పర్వాలేదు కానీ ప్రతికూల వ్యాఖ్యలు చేయాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకునే మాట్లాడతారు. అలాంటిది సొంత పార్టీకి, అదీ జగన్ సొంత గడ్డ రాయలసీమకు చెందిన ఓ వైసీపీ ఎమ్మెల్యే మాత్రం ఇవాళ జగన్ పై అడ్డూ అదుపూ లేకుండా రెచ్చిపోయారు.

సీఎం జగన్ ను ఉద్దేశించి తాడిపత్రి వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇవాళ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 'జగనన్న లాంటి నాయకుడు ఇన్ని అబద్దాలు చెప్పుకుంటూ.. ప్రజలను మోసపుచ్చుకుంటూ బతకడం మంచిదికాదని' వ్యాఖ్యానించారు. మనిషిగా పుట్టాక అంతో.. ఇంతో సహాయం చేయాలని, అలాంటి గుణం లేనప్పుడు ఎవరి పరిధిలో వారుండాలన్నారు... రాజకీయ లబ్ధికోసం ఏం మాట్లాడతారో తెలియని పరిస్థితిలో జగన్ ఉన్నారని కేతిరెడ్డి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రిపై ఎమ్మెల్యే చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం అనంతపురం జిల్లాలో తీవ్ర సంచలనంగా మారాయి.

ysrcp mla ketireddy peddareddy controversial comments against cm ys jagan

తాడిపత్రి నియోజక వర్గంలో ఎంపీడీవో కార్యాలయం వద్ద వైఎస్సార్ ఆసరా కార్యక్రమంలో మహిళలకు చెక్కుల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే కేతిరెడ్డి విపక్షాలను విమర్శిస్తూనే అదే క్రమంలో జగన్ పైనా రెచ్చిపోయారు. సీఎం జగన్‌పై ఎన్నడూ లేనంతగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో అక్కడే ఉన్న పార్టీ నేతలు అవాక్కయ్యారు. అంతలోనే తేరుకుని ఎమ్మెల్యే వ్యాఖ్యల్ని తప్పుబట్టారు. అయితే ఎమ్మెల్యే నోరుజారి ఈ వ్యాఖ్యలు చేశారని కేతిరెడ్డి వర్గీయులు చెబుతున్నప్పటికీ అధికారపార్టీలో మాత్రం ఎమ్మెల్యే వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం నుంచి తొలిసారి కేతిరెడ్డి పెద్దారెడ్డి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. అదీ తాడిపత్రిలో రాజకీయ ఉద్ధండులుగా పేరు తెచ్చుకున్న జేసీ కుటుంబాన్ని ఢీ అంటే ఢీ అని ఢీకొట్టి మరీ కేతిరెడ్డి విజయం సాధించారు. జగన్ పంతాన్ని ఆయన అలా నెరవేర్చారు. అలాంటి కేతిరెడ్డి ఇవాళ సీఎం జగన్ ను ఉద్దేశించి ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేశారన్న దానిపై తీవ్ర చర్చ జరుగుతోంది. కొంతకాలంగా ఆయనలో గూడుకట్టుకు ని ఉన్న అసంతృప్తే దీనికి కారణమని మరికొందరు చెప్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+