ఏపీలో ప్లే గ్రౌండ్ లేని స్కూళ్లు 4059-సర్కార్ కీలక ఆదేశాలు..!
ఏపీలో తాజాగా అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ వివిధ మాధ్యమాల ద్వారా తమ దృష్టికి వస్తున్న పలు కీలక అంశాల్లో సంచలన ఆదేశాలు జారీ చేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని పాఠశాలల్లో ప్లే గ్రౌండ్స్ సౌకర్యంపై ఓ విద్యార్థి నుంచి వచ్చిన వినతిని పరిశీలించిన ప్రభుత్వం స్పందించింది. రాష్ట్రంలో ప్లే గ్రౌండ్స్ లేని స్కూళ్లను గుర్తించి వివరాలు ఇవ్వాలని అధికారుల్ని ఆదేశించడంతో పాటు వాటిలో సాధ్యమైనంత త్వరగా ఈ సౌకర్యం కల్పించాలని కూడా ఆదేశించింది.
న్యూఢిల్లీకి చెందిన అర్హాన్ ముఖర్జీ సాహా అనే విద్యార్ధి దేశవ్యాప్తంగా స్కూళ్లలో ప్లే గ్రౌండ్ సదుపాయం కల్పించాలని అన్ని ప్రభుత్వాలను కోరాడు. దీంతో రాష్ట్రంలోని పాఠశాలల్లో ప్లే గ్రౌండ్ సౌకర్యంపై ప్రభుత్వం వివరాలు తెప్పించుకుంది. ఇందులో రాష్ట్రంలో మొత్తం 58950 స్కూల్స్ ఉండగా.. వీటిలో 54891 స్కూల్స్ కు మాత్రమే ప్లే గ్రౌండ్ సౌకర్యం ఉన్నట్లు నిర్దారించింది. మిగిలిన 4059 స్కూల్స్ కు కూడా ప్లే గ్రౌండ్ సౌకర్యం కల్పించాలని ప్రాంతీయ విద్యాశాఖ అధికారుల్ని, జిల్లా విద్యాశాఖ అధికారుల్ని ఆదేశించింది.

అలాగే రాష్ట్రంలో ఇలా ప్లే గ్రౌండ్ లేని స్కూళ్ల వివరాలు సమగ్రంగా అధ్యయనం చేసి సమర్పించాలని పాఠశాల విద్యాశాఖ అధికారుల్ని ఆదేశించింది. వీటి ఆధారంగా మిగిలిన స్కూళ్లలోనూ ప్లే గ్రౌండ్ సౌకర్యం కల్పించేందుకు సిద్దమవుతోంది. ఇప్పటికే ప్రైవేటు పాఠశాలల్లో ప్లే గ్రౌండ్ సౌకర్యాలు ఉండటం లేదు. అలాగే ప్రభుత్వ స్కూళ్లలో సైతం ప్లే గ్రౌండ్స్ లేవన్న ఫిర్యాదులు వస్తున్నాయి. ఇప్పుడు ప్రభుత్వ ఆదేశాలతో అన్ని స్కూళ్లలో ప్లే గ్రౌండ్ సౌకర్యం కల్పించబోతున్నారు.












Click it and Unblock the Notifications