పవన్ నిలబడటమే గగనం, ఎన్టీఆర్‌పై బాబు కుట్రలు ఇలా: జగన్ మించిపోయాడన్న ఏబీకే ప్రసాద్

Subscribe to Oneindia Telugu
  చంద్రబాబు ఎంతఘోరంగా ఎన్టీఆర్‌ని దెబ్బతీసారో నాకు తెలుసు !

  హైదరాబాద్: ప్రముఖ పాత్రికేయులు, సంపాదకులు, రాజకీయ విశ్లేషకులు ఏబీకే ప్రసాద్.. టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.

  ఆయన ఓ టీవీ చానల్ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఏబీకే ప్రసాద్.. జనసేన తాజా పరిణామాలపై స్పందించారు. అసలు ఆ సెక్షన్ గురించి తడమడమే అనవసరమని ఆయన చెప్పారు.

  పవన్ ఎప్పుడు నిలబబతాడో..

  పవన్ ఎప్పుడు నిలబబతాడో..

  పవన్ ఎప్పుడు నిలబడతాడో, ఎక్కడ నిలబడతాడోనన్నది ఎవరికీ అర్థంకాని విషయమని ఏబీకే ప్రసాద్య వ్యాఖ్యానించారు. కొంతమంది లేస్తే మనిషిని కాదని చెబుతుంటారని, పవన్ కళ్యాణ్ కు లేవడమే గగనమైపోయిందని అన్నారు.

   ముగ్గురూ ముగ్గురే

  ముగ్గురూ ముగ్గురే

  ‘కేంద్రంలో మోడీ, ఏపీలో చంద్రబాబు, తెలంగాణలో కేసీఆర్‌ ముగ్గురూ నిరంకుశమైన ఆలోచనా విధానం ఉన్నవారే. ఏ విషయంలో అయినా సరే వీరి వైఖరి అప్రజాస్వామికం. పాలకులు తమ ఉనికికోసం కొన్ని మంచిపనులు చేయడం తప్పదు. కానీ, వాటిని ఆధారం చేసుకుని వారి పాలన మొత్తం గొప్పది అని చెప్పలేం. ప్రజలకు కొన్ని తాయిలాలు ఇస్తున్నారు. దాంతో వీరేదో కొంత మేలు చేస్తున్నారు అనే భ్రమల్లోంచి జనం బయటపడటం లేదు' అని ఏబీకే అన్నారు.

   పోలవరం వ్యయం పెంచారు

  పోలవరం వ్యయం పెంచారు

  ‘మొత్తం ప్రాజెక్టు విషయంలో ఒక ప్రాతిపదిక లేకుండా చంద్రబాబు ముందుకు వెళ్లాడు. ప్రత్యేక హోదాతో ముడిపడిన అన్ని అంశాలను ఆ ప్రత్యేక హోదా లేకుండా వస్తాయని అనుకోవడం పెద్ద భ్రమ. అధికారాన్ని స్వాధీనం చేసుకోవడమే అతి ప్రధాన కర్తవ్యమైపోయింది. ఇప్పుడు ప్రత్యేక హోదానే లేదు. విభజన చట్టంలో ప్రకటించిన 16 వేల కోట్ల రూపాయలనే ఇవ్వడానికి సిద్ధపడిన కేంద్రం.. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టుకు పెంచిన 60 వేల కోట్లను ఇవ్వమంటే ఎందుకిస్తుంది?' అని ఏబీకే ప్రశ్నించారు.

  ఎన్టీఆర్‌ను బాబు దెబ్బతీశారిలా..

  ఎన్టీఆర్‌ను బాబు దెబ్బతీశారిలా..

  ‘చంద్రబాబు ఎంతఘోరంగా ఎన్టీఆర్‌ని దెబ్బతీశారు అనేది అందరికీ తెలిసిందే. ఆగస్టు సంక్షోభంలో ప్రతిపక్ష నేత మైసూరారెడ్డి వద్దకే చంద్రబాబు వెళ్లి తనవైపు 40 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారని, ఈ సంఖ్యను ఎలా పెంచాలి అని అడిగారు. కేవలం 40 మంది ఎమ్మెల్యేలతో ఎన్టీఆర్‌ని ఎలా తప్పిస్తావు అని మైసూరా అడిగారు. ఇది నా కల్పన కాదు. మైసూరారెడ్డే స్వయంగా నాతో చెప్పినమాట ఇది. ఆ తర్వాత రెండురోజుల లోపే పూటకో రీతిగా బాబుకు అనుకూలమైన ఎమ్మెల్యేల సంఖ్య పెరిగిపోతూ వచ్చింది. వంశపారంపర్య రాజకీయాల్లో కేవలం నోటి మాటల ద్వారా, పుకార్ల ద్వారా ఎలా సమీకరణ చేయవచ్చనడానికి ఇదొక కొత్త తీరు. ఎన్టీఆర్‌ ప్రజలవద్దకు పాలన పథకం కోసం శ్రీకాకుళం వెళితే ఆయన కన్నా ముందు బాబు విశాఖపట్నం వెళ్లి ఫోన్ల రాజకీయాలు చేశారు. ఒకేరోజు దాదాపు 1200 మందికి చంద్రబాబు ఫోన్ల మీద ఫోన్లు చేశారు. ఆ కాల్‌ లిస్టును తర్వాత నేను పనిగట్టుకుని సేకరించి తెప్పించాను. తర్వాత ఏం జరిగిందో తెలిసిందే' అని ఏబీపీ గుర్తు చేశారు.

   కుట్ర గురించి ఎన్టీఆర్ కు తెలియదు

  కుట్ర గురించి ఎన్టీఆర్ కు తెలియదు

  ‘తన వెనుక అంత పెద్ద కుట్ర జరుగుతున్నా దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ కనిపెట్టలేకపోయారంటే కారణం, కుట్ర చేయడం అందరికీ సాధ్యం కాకపోవడమేనని సీనియర్‌ జర్నలిస్టు ఏబీకే ప్రసాద్‌ అన్నారు. వంశపారంపర్య రాజకీయాల్లో కేవలం నోటి మాటల ద్వారా, పుకార్ల ద్వారా ఎలా ఎమ్మెల్యేలను పెద్ద ఎత్తున ఫిరాయింపు చేయవచ్చో ఆనాడే బాబు తనకే సాధ్యమైన పద్ధతిలో చేసి చూపించారని ఎద్దేవా చేశారు. లక్ష్మీపార్వతిపై దుష్ప్రచారంలో రజనీకాంత్‌ను తోడు తెచ్చుకుని మరీ బాబు సాగించిన చర్య దారుణం' అని ఏబీకే వివరించారు.

  జగన్ మించి పోయాడు

  జగన్ మించి పోయాడు

  ‘వైయస్ జగన్.. పాదయాత్రలో తన తండ్రి వైయస్సార్‌కి మించిన జనసమీకరణ చేస్తున్నారు. ఇప్పుడు జరుగుతున్న పాదయాత్రను క్రౌడ్‌ పుల్లింగ్‌గానే చెప్పొచ్చు. కానీ ఏ పాలకుడికైనా ఇచ్చిన హామీలను అమలు చేయడమే అసలైన పరీక్ష. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారన్నదే ప్రధానం' అని ఏబీకే ప్రసాద్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Senior journalist ABK Prasad delivered his views on current politics in a interview.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి