Pawan Kalyan : సీఎం పవనే..? ఊర్వశీ రౌటేలా మరో ట్వీట్ హల్ చల్...

బాలీవుడ్ నటి ఊర్వశీ రౌటేలా ఈ మధ్య టాలీవుడ్ లో మెరుపులు మెరిపిస్తున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ నటించిన బ్రో సినిమాలో ఓ పాటలో మెరిసిన ఊర్వశి, అంతకు ముందు ఆయన అన్న చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్యలోనూ ఓ ఐటమ్ సాంగ్ లో నటించారు. దీంతో మెగా కుటుంబంతో ఆమె అనుబంధం అంతకంతకూ పెరుగుతోందని అర్ధమవుతోంది. ఇదే క్రమంలో ట్విట్టర్ లో అభిమానుల ప్రశ్నలకు ఆస్క్ ఊర్వశీ పేరుతో హ్యాష్ ట్యాగ్ పెట్టి సమాధానాలు ఇస్తున్న ఊర్వశికి ఓ అనూహ్య ప్రశ్న ఎదురైంది.

Urvashi Rautela

ట్విట్టర్ లో ఓ అభిమాని ఊర్వశీ రౌటేలాను వచ్చే ఎన్నికల్లో సీఎం అభ్యర్ధిగా మరోసారి పోటీపడనున్న ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ తో పాటు జనసేన అధినేత, హీరో పవన్ కళ్యాణ్ లలో ఒకరిని ఎంచుకోమని అడిగారు. దీంతో ఆమె ఏమాత్రం తడబడకుండా పీఎస్పీకే అంటూ సమాధానం ఇచ్చేశారు. తద్వారా సీఎం పదవికి తన ఛాయిస్ పవన్ కళ్యాణే అని చెప్పకనే చెప్పారు. దీంతో ఇప్పుడు ఊర్వశీ రౌటేలా ఇచ్చిన సమాధానాన్ని పవన్ అభిమానులు వైరల్ చేస్తున్నారు.

Urvashi Rautela

పవన్ కళ్యాణ్ తాజా మూవీ బ్రోలో ఓ ఐటమ్ సాంగ్ లో మెరిసిన ఊర్వశీ రౌటేలా ఈ సినిమా విడుదలకు ముందు రోజు కూడా ప్రమోషన్ ట్వీట్ పెట్టింది. ఇందులో ఏకంగా పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రిగానే అభివర్ణించింది. ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అంటూ ఊర్వశీ పెట్టిన ట్వీట్ పై వైసీపీ అభిమానులు స్పందించి కౌంటర్లు ఇచ్చారు. ఇప్పుడు మరోసారి జగన్, పవన్ లలో ఒకరిని ఎంచుకోమంటే ఏమాత్రం తడబడకుండా పవనే అంటూ ఊర్వశీ ఎంచుకోవడంతో ఈ ట్వీట్ పై మరో చర్చ జరుగుతోంది.

Urvashi Rautela

వచ్చే ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రచారంతో పాటు వరుస సినిమాల్లో హంగామా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ తో పాటు మెగా కుటుంబ హీరోలతో మరిన్ని అవకాశాల కోసం ఎదురుచూస్తున్న ఊర్వశీ రౌటేలా అందులో భాగంగానే పవన్ కు మద్దతుగా ఇలాంటి పోస్టులు పెట్టడం, రిప్లైలు ఇవ్వడం చేస్తుందనే చర్చ జరుగుతోంది. అయితే పవన్ రాజకీయాల్లోనూ యాక్టివ్ గా ఉన్న నేపథ్యంలో ఊర్వశి పోస్టులకు కౌంటర్లు కూడా అదే స్ధాయిలో పడుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+