ఆళ్లగడ్డ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రికార్డ్: నాడు తాత, నేడు అఖిలప్రియ, 35 ఏళ్ళ తర్వాత ఆళ్ళగడ్డకు

కర్నూల్ జిల్లా నుండి తొలి మహిళా మంత్రిగా రికార్డు సృష్టించిన భూమా అఖిలప్రియ మరో రికార్డును కూడ స్వంతం చేసుకొన్నారు. ఆళ్ఘగడ్డ నియోజకవర్గం నుండి ప్రాతినిథ్యం వహించిన అఖిలప్రియకు మంత్రిపదవి దక్కింది. ఈ

By Narsimha
|
Google Oneindia TeluguNews

కర్నూల్: కర్నూల్ జిల్లా నుండి తొలి మహిళా మంత్రిగా రికార్డు సృష్టించిన భూమా అఖిలప్రియ మరో రికార్డును కూడ స్వంతం చేసుకొన్నారు. ఆళ్ఘగడ్డ నియోజకవర్గం నుండి ప్రాతినిథ్యం వహించిన అఖిలప్రియకు మంత్రిపదవి దక్కింది. ఈ నియోజకవర్గం నుండి ప్రాతినిథ్యం వహించిన ఎస్వీ సుబ్బారెడ్డి కూడ గతంలో టిడిపి హయంలో మంత్రిగా పనిచేశారు.

కర్నూల్ జిల్లా నుండి తొలిసారి మంత్రి పదవిని దక్కించుకొన్న మహిళగా అఖిలప్రియ రికార్డును సృష్టించారు. ఈ జిల్లా నుండి చాలామంది మహిళలు ఎమ్మెల్యేలుగా విజయం సాధించినా మంత్రి పదవినిచేపట్టలేదు.

అయితే భూమా శోభానాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో అకాలమరణం చెందడంతో అఖిలప్రియ రాజకీయాల్లోకి అనివార్యంగా వచ్చారు. ఆళ్ళగడ్డ నియోజకవర్గం నుండి ఆమె విజయం సాధించారు.

అయితే గత ఏడాది వైసీపీని వీడి తండ్రి భూమా నాగిరెడ్డితో కలిసి ఆమె టిడిపిలో చేరారు. అయితే గత మాసంలో భూమా నాగిరెడ్డి గుండెపోటుతో మరణిండంతో చంద్రబాబునాయుడు తన మంత్రివర్గంలోకి అఖిలప్రియను తీసుకొన్నారు.

నాడు తాత, నేడు అఖిలప్రియ

నాడు తాత, నేడు అఖిలప్రియ

ఆళ్ళగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం నుండి గతంలో టిడిపి నుండి ప్రాతినిథ్యం వహించిన ఎస్వీ సుబ్బారెడ్డి 35 ఏళ్ళ క్రితం మంత్రిగా పనిచేశారు.సుదీర్ఘకాలంపాటు ఆయన టిడిపిలో ఉన్నారు.

2007లో జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో టిడిపి అధిష్టాన నిర్ణయానికి వ్యతిరేకంగా ఆయన ఓటు చేశారు.దీంతో ఆయనను పార్టీ దూరంగా పెట్టింది.అయితే టిడిపి హయంలోనే ఆయన ఆళ్ళగడ్డ నుండి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఎన్ టి ఆర్ మంత్రివర్గంలో ఆయన మంత్రిగా పనిచేశారు.ప్రస్తుతం అఖిలప్రియ కూడ ఇదే నియోజకవర్గం నుండి ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

విషాధ ఘటనల తర్వాతే అఖిలప్రియ ఇలా

విషాధ ఘటనల తర్వాతే అఖిలప్రియ ఇలా


భూమా శోభానాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించారు.2014 లో అసెంబ్లీ ఎన్నికల ముందు ఎన్నికల ప్రచారం నిర్వహించుకొని తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో ఆమె మరణించారు. అయితే ఆళ్ళగడ్డకు జరిగిన ఉప ఎన్నికల సందర్భంగా భూమా అఖిలప్రియ రాజకీయాల్లోకి అనివార్యంగా రావాల్సిన పరిస్థితులు వచ్చాయి.

ఆళ్ళగడ్డ నుండి ఆమె ప్రస్తుతం ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. తల్లి మరణంతో రాజకీయరంగ ప్రవేశం అనివార్యంగా మారింది. ఇక భూమా నాగిరెడ్డి గత నెలలో గుండెపోటుతో మరణించడంతో అఖిలప్రియకు మంత్రిపదవి దక్కింది.

మంత్రిపదవిని చేపట్టకుండానే

మంత్రిపదవిని చేపట్టకుండానే

భూమా నాగిరెడ్డి మంత్రి పదవిని చేపట్టకుండానే చనిపోయారు. అయితే హఠాన్మరణంతో భూమా నాగిరెడ్డి మరణించడంతో అనివార్యంగా మంత్రివదవిని అఖిలప్రియ చేపట్టాల్సి వచ్చింది.

అయితే ఈ కుటుంబానికి రాజకీయాలతో సుధీర్ఘ అనుభవం ఉంది. భూమా దంపతులు మాత్రం మంత్రి పదవిని చేపట్టలేదు. మంత్రి పదవిని పొందే సమయంలోనే నాగిరెడ్డి మరణించారని ఆయన సన్నిహితులు ఆవేదన చెందుతున్నారు.

పార్టీలు మారినా టిడిపిలోనే మంత్రిపదవి

పార్టీలు మారినా టిడిపిలోనే మంత్రిపదవి

ఆళ్ళగడ్డ నుండి ప్రాతినిథ్యం 35 ఏళ్ళ క్రితం ప్రాతినిథ్యం వహించిన ఎస్వీ సుబ్బారెడ్డి ఎన్టీఆర్ మంత్రివర్గంలో చోటు దక్కింది.అయితే భూమా దంపతులు కూడ టిడిపిలోనే ఉండేవారు.

అయితే 2009 ఎన్నికలకు ముందు టిడిపిని వీడి పిఆర్ పి లో చేరారు భూమా దంపతులు. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.భూమా దంపతులు పిఆర్ పి నుండి కాంగ్రెస్ కు, వైసీపికి మారారు.అయితే వైసీపి నుండి టిడిపిలో చేరిన తర్వాతే భూమా అఖిలప్రియకు మంత్రిపదవి దక్కింది.తాత ఎస్వీ సుబ్బారెడ్డి నాడు టిడిపి నుండే మంత్రి పదవిని నిర్వహించగా, మనమరాలు అఖిలప్రియకు కూడ టిడిపియే మంత్రి పదవిని కట్టబెట్టింది.

అఖిలప్రియకు కత్తిమీద సామే

అఖిలప్రియకు కత్తిమీద సామే

నంద్యాల, ఆళ్ళగడ్డ నియోజకవర్గాల్లో తన వర్గాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.అయితే రాజకీయాల్లో ఆమెకు సుధీర్ఘ అనుభవం లేదు. కేవలం మూడేళ్ళ అనుభవం మాత్రమే ఉంది. ఈ రెండు నియోజకవర్గాల్లో కూడ ఫ్యాక్షన్ గొడవలున్నాయి.అయితే వీటన్నింటిని తట్టుకొంటూ నిలబడడం అఖిలప్రియకు కత్తిమీద సామే.అయితే పార్టీలోని భూమా నాగిరెడ్డి వైరి వర్గం సహకారం ఏ మేరకు ఉంటుందో చెప్పలేని పరిస్థితి.

English summary
after 35 years allagadda assembly segment got minister post. sv subbareddy got minister post before 35 years,now akhilapriya got ministry.both of same family.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X