Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏపీలో రైతులకు అలర్ట్-ఎన్టీరంగా వ్యవసాయ యూనివర్శిటీ కీలక సూచనలు..!

ఏపీలో ఈ ఏడాది వాతావరణ పరిస్దితులు ఎలా ఉండబోతున్నాయి, ఇందుకు తగినట్లుగా రైతులు (farmers) ఖరీఫ్, రబీ సీజన్లలో పంటలకు ఎలా ప్లాన్ చేసుకోవాలో వివరిస్తూ ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం (NG Ranga Agriculture University) ఇవాళ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ఏడాది ప్రపంచ వాతావరణ వ్యవస్థలో చోటుచేసుకుంటున్న మార్పులు, ఎల్ నినో పరిస్థితుల నేపథ్యంలో రైతులు వ్యవసాయ పనుల్లో ముందస్తు ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని యూనివర్సిటీ వీసీ ఆర్. శారదా జయలక్ష్మి సూచించారు.

ఈ ఏడాది ఫిబ్రవరి నుండి ఏప్రిల్ వరకు తటస్థ పరిస్ధితులు ఉండే అవకాశం ఉందని, ప్రస్తుతం హిందూ మహాసముద్రంలో న్యూట్రల్ ఐఓడి పరిస్థితులు ఉన్నాయని ఆమె తెలిపారు. రాబోయే వేసవి, నైరుతి రుతుపవనాల కాలంలో (జూన్ - ఆగస్టు 2026) కూడా వాతావరణం సాధారణ స్థితిలో ఉండే అవకాశం (సుమారు 56%) ఉన్నట్లు అంతర్జాతీయ అంచనాలు సూచిస్తున్నాయన్నారు. అయితే ద్వితీయార్థంలో ఎల్ నినో పరిస్థితులు మళ్ళీ అభివృద్ధి చెందే అవకాశం (సుమారు 60%) ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారన్నారు.

Alert for Farmers NG Ranga Agriculture University Predicts Possible Weather Conditions

వాతావరణంలోని ఈ మార్పులు మన దేశ నైరుతి రుతుపవనాల సరళిపై ప్రభావం చూపే అవకాశం ఉందని, దీని ప్రభావం వల్ల వర్షాధార వ్యవసాయంపై ప్రభావం పడే అవకాశం ఉన్నందున, రైతులు అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
భారత వాతావరణ శాఖ, వ్యవసాయ శాఖ జారీ చేసే సూచనలను రైతులు ఎప్పటికప్పటి తప్పనిసరిగా గమనించాలన్నారు.
స్థానిక వ్యవసాయ కేంద్రాల సలహాలు, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలను ఎంచుకోవాలన్నారు. వాతావరణ అనిశ్చితిని తట్టుకునేలా సాగులో శాస్త్రీయ పద్ధతులను, నీటి యాజమాన్య పద్ధతులను పాటించాలన్నారు. వ్యవసాయ రంగంలో వచ్చే సవాళ్లను ఎదుర్కోవడానికి, దిగుబడి నష్టాలను నివారించడానికి రైతులు అప్రమత్తంగా ఉండి, శాస్త్రవేత్తల సలహాలను అనుసరించాలని ఆమె కోరారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+