డ్యామిడ్.. ఏపీలో బీఆర్ఎస్ కథ అడ్డం తిరిగింది!!
తెలంగాణ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా పార్టీని విస్తరించడానికి శతవిధాలా ప్రయత్నం చేస్తున్నారు. అయితే పక్క రాష్ట్రమైన ఏపీలో మాత్రం ఇప్పటివరకు అడుగు పెట్టలేకపోతున్నారు. ఏపీలో అడుగు పెట్టడానికి ఆయన వేసుకున్న ప్లాన్స్ అన్ని ఒక్కటొక్కటిగా బూమరాంగ్ అవుతున్నాయి. ఏపీలో భారీ బహిరంగసభ నిర్వహించి ఏపీ ప్రజల సమస్యలను తీర్చే పార్టీగా బీఆర్ఎస్ ను చూపించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. కానీ ఆ ప్రయత్నాలేవీ ఫలించలేదు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తోట చంద్రశేఖర్ ను రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రకటించిన నాటి నుంచి ఇప్పటి వరకు ఏపీలో పెద్దగా బిఆర్ఎస్ పుంజుకున్నది లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధాన సమస్యలైన రాజధాని సమస్య, ప్రత్యేక హోదా సమస్య, విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యలపైన ఫోకస్ చేసి ప్రజాక్షేత్రంలో ప్రజల మద్దతు పొందాలని ప్రయత్నం చేస్తున్నా బీఆర్ఎస్ ను అక్కడి ప్రజలు పట్టించుకున్న దాఖలాలు లేవు.
రాజధాని విషయంలో అమరావతి రాజధాని అని బిఆర్ఎస్, మూడు రాజధానులు వ్యతిరేకిస్తున్నట్టు తన స్టాండ్ చెప్పినా ప్రజల నుంచి పెద్దగా స్పందన రాలేదు. ఇక కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఏపీకి అన్యాయం చేసిందని, ఏపీలో ఉన్న రాజకీయ పార్టీలు ఈ విషయంపై కేంద్రాన్ని నిలదీయడం లేదని, కేంద్రంపై తాము పోరాటం చేస్తున్నామని చెబుతున్నా ఏపీ ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు.

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై పోరాటం చేస్తామని చెప్పి, విశాఖ స్టీల్ ప్లాంట్ ను కొనుగోలు చేయడానికి బిడ్ వేయడం కోసం ప్రణాళికలు రూపొందించి, సింగరేణి అధికారులను కూడా అధ్యయనం చెయ్యటానికి పంపి మళ్లీ స్టీల్ ప్లాంట్ విషయంలో సైలెంట్ అయింది బిఆర్ఎస్.స్టీల్ ప్లాంట్ కొనుగోలుకు బిడ్ వేస్తారని భావించినా బిడ్ వెయ్యలేదు. దీంతో విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలోనూ కెసిఆర్ ప్లాన్ బూమరాంగ్ అయింది.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం వెనక్కి తగ్గిందని కేసీఆర్ దెబ్బకు కేంద్ర అబ్బ అందని, విశాఖలో విజయోత్సవాలు కూడా నిర్వహిస్తామని చెప్పుకొని, తీరా కేంద్రం అలాంటిదేమీ లేదని చెప్పేసరికి నాలుక కరుచుకుంది. తాజా పరిణామాలతో ఏపీలో బీఆర్ఎస్ రాజకీయాలు చేయడం అంత సులువు కాదు అన్న అభిప్రాయం వ్యక్తమౌతుంది. వరుసగా అన్ని ప్లాన్లు ఫెయిల్ కావడంతో ఏపీలో బిఆర్ఎస్ ఎంట్రీ విషయంలో సీఎం కేసీఆర్ ఏం చేస్తారు అన్నది తెలియాల్సి ఉంది.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!












Click it and Unblock the Notifications