Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏపీలో కాపు రాజకీయం టార్గెట్ ఇదేనా ? చంద్రబాబు ఆఫర్లు ? వైసీపీ కాపులకు ఇరకాటం !

ఏపీలో గతంలో పలుమార్లు అధికారానికి దగ్గరగా వచ్చినట్లే వచ్చి దూరమైన కాపుల్ని ఈసారి ఎలాగైనా అధికార పగ్గాలు అందుకునేలా చేసేందుకు భారీ రాజకీయం నడుస్తోంది. ఇందుకు వైసీపీ మినహా అన్ని పార్టీల్లోని కాపు నేతలు తమ మధ్య విభేదాల్ని పక్కనబెట్టి ఏకమయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. వీరంతా ఇప్పుడు ఉమ్మడి టార్గెట్ దిశగా అడుగులేస్తున్నారు. ఇదే అదనుగా చంద్రబాబు కూడా వారికి ఆఫర్లు పంపుతున్నట్లు తెలుస్తోంది. ఇదంతా వీరికి దూరంగా ఉంటున్న వైసీపీలో కాపు నేతలకు ఇబ్బందికరంగా మారుతోంది.

 కాపు పాలిటిక్స్

కాపు పాలిటిక్స్


ఏపీలో కాపు రాజకీయం జోరుగా సాగుతోంది. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిస్ధితుల్ని సద్వినియోగం చేసుకోవాలన్న లక్ష్యంతో కాపులంతా ఏకమవుతున్నారు. ఇన్నాళ్లూ రాష్ట్ర రాజకీయాల్లో ప్రభావం చూపే నేతలు తమ వద్ద లేరని భావించిన వారంతా ఎవరికి వారుగా ఉండిపోయారు. కానీ ఇప్పుడు పరిస్ధితుల్లో క్రమంగా మార్పు కనిపిస్తోంది. ముఖ్యంగా ప్రధాని మోడీ విశాఖ టూర్ అనంతర పరిణామాల్లో పవన్ కళ్యాణ్ కు పెరుగుతున్న మద్దతు అన్ని పార్టీల్ల కాపు నేతల్ని ఆలోచనలో పడేస్తోంది. గతంలో పవన్ అన్న చిరంజీవికి మద్దతుగా నిలవడంలో విఫలమైన తాము ఈసారి మాత్రం అవకాశం అస్సలు వదులుకోవద్దనే ఆలోచనతో ఉన్నట్లు కనిపిస్తోంది.

పవన్ కు మద్దతుగా రాజకీయం ?

పవన్ కు మద్దతుగా రాజకీయం ?


రాష్ట్రంలో ప్రస్తుతం నడుస్తున్న కాపుల సమావేశాల ప్రధాన లక్ష్యం తమ సామాజిక వర్గానికి ఈసారి రాజ్యాధికారం దక్కించుకోవడమే.ఇందులో ప్రధానంగా ముందున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఏకపక్షంగా మద్దతిచ్చి అండగా నిలవడమా ఆయన కంటే బలమైన నేత కనిపిస్తే ఆయనకు మద్దతివ్వడమా అనే రెండు అంశాల చుట్టూనే ఈ రాజకీయం నడుస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తాజాగా మారిన పరిస్దితుల్లో పవన్ కేంద్రంగా రాష్ట్ర రాజకీయం సాగుతున్న వేళ.. తాము కూడా పవన్ కు అండగా నిలవడం ద్వారా అధికారం సాధించుకోవాలన్న తపన వారిలో కనిపిస్తోంది. దీంతో పార్టీల కతీతంగా కాపు నేతలంతా ఏకమవుతున్నారు. వైసీపీ మాత్రం ఇందుకు దూరంగా ఉంది.

 చంద్రబాబు ఆఫర్లు ?

చంద్రబాబు ఆఫర్లు ?

రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిస్ధితుల్లో కాపులకు రాజ్యాధికారం డిమాండ్ పెరుగుతోంది. అంటే ఇప్పటిదాకా అందుకున్న పదవులతో సరిపెట్టకుండా రాష్ట్రాన్ని నడిపించే పదవిలో తమ నేతను చూసుకోవాలనే డిమాండ్ పెరుగుతోంది. దీంతో విపక్ష టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఆలోచనలో పడుతున్నారు. ఈసారి పవన్ మద్దతు ఊరికే తీసుకోవడం సాధ్యం కాదనే విషయం ఆయనకూ అర్దమైంది. దీంతో చంద్రబాబు ఈసారి అధికారాన్ని పవన్ కు ఆఫర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కాపులకు సీఎం పదవి ఇచ్చేందుకూ సిద్దమని తాజాగా గోదావరి జిల్లాల పర్యటనలో చంద్రబాబు పంపిన సంకేతాలు ఇందులో భాగమే. దీంతో చంద్రబాబు ఆఫర్లపైనా కాపుల్లో చర్చ జరుగుతోంది.

 వైసీపీ కాపులకు సంకటం ?

వైసీపీ కాపులకు సంకటం ?

ఓవైపు పవన్ కు మద్దతుగా ఏకమవుతున్న అన్నిపార్టీల కాపులు, దీన్ని సొమ్ము చేసుకుని అధికారం అందుకునేందుకు చంద్రబాబు వేస్తున్న అడుగులు.. ఇవన్నీ ఇప్పుడు వైసీపీలో కాపు నేతలకు సంకటంగా మారుతున్నాయి. ఎందుకంటే ఇన్నాళ్లూ కాపులకు వైసీపీ మాత్రమే మేలు చేస్తోందని చెప్పుకుంటున్న నేతలకు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేయక తప్పని పరిస్దితి ఏర్పడుతోంది. దీంతో పవన్ పై అనివార్యంగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఇది సొంత సామాజిక వర్గంలో వారిపై వ్యతిరేకత పెంచుతోంది. ఇదే పరిస్దితి కొనసాగితే రేపు తమ నియోజకవర్గాల్లో సొంత సామాజిక వర్గం మద్దతు కోల్పోతామనే బెంగ వారిలో పెరుగుతోంది. అయినా వెనక్కి తగ్గే పరిస్దితి లేదు. దీంతో అటు జగన్ మాట కాదనలేక, ఇటు సొంత కులం అభిప్రాయానికి భిన్నంగా అడుగులు వేయలేక వైసీపీ కాపులు ఇరుకునపడుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+