Amaravati Iconic Bridge: ఏపీ దర్పాన్ని డిసైడ్ చేసేది మీరే!

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని రాయపూడి నుంచి ఎన్టీఆర్ జిల్లా మూలపాడు వరకు ఐదు కిలోమీటర్ల పొడవుతో ఐకానిక్ కేబుల్ బ్రిడ్జిని ఏపీ ప్రభుత్వం నిర్మించాలని నిర్ణయించింది. ఏపీ రాజధాని అమరావతిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని భావిస్తున్న ఏపీ ప్రభుత్వం ఈ మేరకు విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి తో అనుసంధానం ఇచ్చేందుకు కృష్ణా నదిపై ఐకానిక్ కేబుల్ వంతెనను నిర్మించాలని ప్రతిపాదించింది.

అమరావతి ఐకానిక్ వంతెన.. ప్రజలకు ఓటింగ్ అవకాశం
ఈ ప్రాజెక్టు అమరావతికి ప్రత్యేక గుర్తింపు కలిగించేలా ప్రణాళికను రూపొందిస్తున్న ఏపీ సర్కార్ దీనికి సంబంధించి అద్భుతమైన అవకాశాన్ని ప్రజలకు కల్పించింది. ఈ ఐకానిక్ కేబుల్ వంతెనకు సంబంధించి నాలుగు డిజైన్లను ఎంపిక చేసిన ప్రభుత్వం ఆధునిక ఇంజనీరింగ్ శైలిలో కూచిపూడి కళను మేళవించి అమరావతికి గుర్తింపు తీసుకువచ్చేలా వీటిని రూపొందించింది. వీటి ఎంపిక కోసం ప్రజల ఓటింగ్ కు అవకాశం కల్పించింది ఏపీ ప్రభుత్వం.

amaravati iconic bridge AP govt finalised 4 models and kept for public voting in CRDA website

సిఆర్డిఏ వెబ్సైట్లో ఓటింగ్
రాజధాని ఐకానిక్ వంతెన ఎంపిక డిజైన్లను సెలెక్ట్ చేయడం కోసం సిఆర్డిఏ వెబ్సైట్లో ఓటింగ్ కు పెట్టారు. మొత్తం నాలుగు నమూనాలలో, మూడు నమూనాలు కూచిపూడి కళతో మేళవించినట్లు గా ఉంటే, ఒక నమూనా అమరావతిని సూచించేలా ఆంగ్ల అక్షరం ఏ ఆకారంలో ఉంది. ఇవన్నీ అమరావతికి ప్రత్యేక గుర్తింపును తీసుకురావడానికి రూపొందించినట్టు అధికారులు చెబుతున్నారు.

amaravati iconic bridge AP govt finalised 4 models and kept for public voting in CRDA website

ప్రజలచే ఓటింగ్.. సిఆర్డిఏ వెబ్సైట్లో ఇలా వెయ్యాలి
అయితే ఇందులో ఏ డిజైన్ బాగుంటుంది అనేది ప్రజాభిప్రాయం మేరకే నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్న ఏపీ సర్కార్ సిఆర్డిఏ వెబ్సైట్లో ఈ డిజైన్లను పెట్టింది. ఓటింగ్ చేయాలనుకునే వారు వెబ్ సైట్ హోం పేజీలోకి వెళ్లి ఓట్ ఫర్ అమరావతి ఐకానిక్ బ్రిడ్జి డిజైన్ అని స్క్రోల్ అయ్యే దానిమీద క్లిక్ చేస్తే దీనికి సంబంధించి వేరే పేజీ ఓపెన్ అవుతుంది.

amaravati iconic bridge AP govt finalised 4 models and kept for public voting in CRDA website

రాయపూడి నుండి మూలపాడు వరకు ఐకానిక్ బ్రిడ్జ్
అందులో మీ పేరు ఫోన్ నెంబర్లు నమోదుచేసి మీకు నచ్చిన ఒక డిజైన్ ఎంచుకొని అనంతరం క్యాప్చ కోడ్ తో ఓటు వేయవచ్చు. ఈ ఐకానిక్ వంతెన అమరావతి రాయపూడి నుండి కృష్ణానదిని దాటి ఎన్టీఆర్ జిల్లా మూలపాడు వరకు నిర్మించనున్నారు ఈ నిర్మాణం పూర్తయితే రాయపూడి నుంచి మూలపాడు వరకు మెరుగైన రవాణా సదుపాయం అందుబాటులోకి వస్తుంది.

కూచిపూడి డిజైన్ లతో అమరావతి ఐకానిక్ బ్రిడ్జ్
ప్రభుత్వం ఎంపిక చేసిన నాలుగు డిజైన్లలో ఒక డిజైన్ కూచిపూడి హస్తముద్ర ను పోలి ఉండే రేడియేటింగ్ కేబుల్ బ్రిడ్జ్. ఇంజనీరింగ్ ను, కళను కలగలిపి నిర్మాణం చేయాలనుకుంటున్న ఒక మోడల్ ఇది. మరొక మోడల్ కూచిపూడి స్వస్తిక్ హస్త భంగిమను పోలి ఉంటుంది. ఎరుపు తెలుపు రంగుల్లో జంట పైలాన్ లతో మన సంస్కృతికి, అదృష్టానికి చిహ్నంగా కనిపించే డాన్స్ బ్రిడ్జి లాగా ఉంటుంది.

amaravati iconic bridge AP govt finalised 4 models and kept for public voting in CRDA website

అత్యధిక ఓట్లు వచ్చిన డిజైన్ ఫైనల్
మరొక మోడల్ అమరావతి లోగో అయిన ఏ ఆకారంలో అభయ ముద్రతో శాంతికి చిహ్నంగా కనిపిస్తుంది. చివరిదైన నాలుగవ మోడల్ కూచిపూడిలోని కపోత ముద్రను హోలీ చేతులు ఎత్తి అభివాదం చేస్తున్నట్టుగా ఉండే మోడల్ లో ఉంటుంది. వీటిలో అత్యధిక ఓట్లు వచ్చిన డిజైన్ ఫైనల్ గా మన అమరావతి ఐకానిక్ వంతెన అవుతుంది. మరెందుకు ఆలస్యం ఏపీ రాజధాని అమరావతికి మరింత ఖ్యాతిని తీసుకువచ్చే అమరావతి ఐకానిక్ వంతెన డిజైన్ కు మీరు ఓటెయ్యండి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+