వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబు...బిజెపితో ఇంకా లాలూచీ...అందుకే ఆ పదవి:అంబటి రాంబాబు,కీలక నిర్ణయాలు

By Suvarnaraju
|
Google Oneindia TeluguNews

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు స్వప్రయోజనాలే తప్ప...రాష్ట్ర ప్రయోజనాలపై ఏ మాత్రం చిత్తశుద్ధి లేదన్న విషయం విజయవాడ దీక్షతో మరోసారి రుజువైందని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు.

శనివారం మీడియాతో మాట్లాడిన అంబటి రాంబాబు చంద్రబాబు ఒక్కపూట దీక్ష గురించి పలు విమర్శలు, ఆరోపణలు చేశారు. చంద్రబాబు చేపట్టింది దొంగ దీక్ష అని, అయితే చంద్రబాబు ఏం మాట్లాడినా ఏం చేసినా సమర్థించేందుకు...ఆయన ...ఆ అంటే అంధ్రజ్యోతి...ఈ అంటే ఈనాడు ఉన్నాయని అని అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు.

మొన్న బంద్‌ సందర్భంగా ఆర్టీసీకి రూ.21 కోట్లు నష్టం వచ్చిందని చంద్రబాబు ప్రకటించారని, మరి చంద్రబాబు దీక్షకు వినియోగించిన ఆర్టీసీ సేవలతో ఇప్పుడు ఆ సంస్థకు నష్టం వాటిల్లడం లేదా?...అని ప్రశ్నించారు. దీక్ష సందర్భంగా అధికారులు అందరూ పనులు మానుకుని వచ్చి దీక్షలో కూర్చున్నారని, దీని వల్ల ప్రజలు ఎంతో ఇబ్బంది పడ్డారన్నారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు తన దీక్ష కోసం రూ.30 కోట్లు ఖర్చు చేశారని, అయితే ఇందుకు సొంత డబ్బు ఖర్చు పెడితే ఫర్వాలేదు కాని ఆయన ప్రజాధనాన్ని ఖర్చు చేశారు. ఇది అన్యాయం కాదా?...అని అంబటి రాంబాబు ధ్వజమెత్తారు.

Ambati Rambabu Slams Chandra Babu Over Deeksha

పైగా దీక్ష పేరిట 1000కి పైగా ఆర్టీసీ బస్సులను వినియోగించారు. మొన్న బంద్‌ సందర్భంగా ఆర్టీసీకి రూ.21 కోట్లు నష్టం వచ్చిందని ప్రభుత్వం ప్రకటించింది. మరీ చంద్రబాబు దీక్షకు వినియోగించిన ఆర్టీసీ సేవలతో నష్టం వాటిల్లలేదా?అధికారులు సైతం పనులు మానుకుని దీక్షలో కూర్చున్నారు. దీక్షతో నాకింత బలం ఉందని చంద్రబాబు చూపించుకున్నారని, కానీ ఏ రాజకీయ పార్టీ కూడా ఆయనకు మద్ధతు ఇవ్వలేదని, ఎందుకంటే అది దొంగ దీక్ష అని అందరికీ తెలుసు కాబట్టని అన్నారు. ఇలాంటి దొంగ దీక్షతో ఘోరంగా మోసగించినందుకు ఐదు కోట్ల ఏపీ ప్రజలకు చంద్ర బాబు క్షమాపణలు చెప్పాల్సిందేనని అంబటి డిమాండ్ చేశారు.

ఇక దీక్ష ముగిసిన తరువాత చంద్రబాబు సుదీర్ఘమైన ప్రసంగం చేసినా అందులో ప్రజలకు పనికొచ్చే విషయాలేమీ లేవని అంబటి అన్నారు. అసలు "విభజన హమీలు" నెరవేర్చాలని కేంద్రానికి చంద్రబాబు ఒక్క డిమాండ్‌ కూడా చేయలేదన్నారు. ప్రత్యేక హోదా తప్పనిసరి అనే వాదన కూడా కేంద్రానికి బలంగా వినిపించలేదు. పైగా కర్ణాటక ఎన్నికల తర్వాత ఏదో జరుగుతుందని చంద్రబాబు చెప్పారని, అదేంటో బయటపెట్టాలని అంబటి రాంబాబు కోరారు

అయితే చంద్రబాబు తీరు చూస్తుంటే ఆయన ఇంకా బీజేపీతో లాలూచీ పడుతున్నట్లు తనకు అనిపిస్తోందన్నారు. ఎపి ప్రభుత్వం తాజాగా చేపట్టిన టిటిడి పాలకమండలి నియామకాల్లో ఒక మెంబర్‌గా మహారాష్ట్ర బీజేపీ నేత స్వప్న మునగంటివార్‌ను నియమించారని, ఇందులో ఆంతర్యం ఏమిటో చంద్రబాబే చెప్పాలన్నారు. టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ కొంచే తేడా మనిషని, అందువల్ల ఆయన ప్రధానిపై చేసిన కామెంట్స్‌పై తాను స్పందించదలుచుకోలేదని చెప్పారు.
ఇక ఆదివారం జరగబోయే వైకాపా అధికార ప్రతినిధుల సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని అంబటి రాంబాబు వెల్లడించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

English summary
Chandrababu should apologizes to the AP people for this kind 420 deeksha Says YSRCP Spokesperson Ambati Rambabu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X