చిరంజీవి పాటకు సతీమణితో కలిసి స్టెప్పులేసిన అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్; వీడియో వైరల్
ఎప్పుడూ రాజకీయాలలో బిజీగా ఉండే నేతలు, వ్యక్తిగత జీవితంలో కుటుంబంతో కలిసి గడపడానికి తక్కువ సమయం కేటాయిస్తుంటారు. అధికార పార్టీలో ఉంటే అభివృద్ధి పైన, ప్రతిపక్ష పార్టీలను ఎదుర్కోవడం పైన, ప్రజల సమస్యలు తెలుసుకోవడం పైన దృష్టి సారించాల్సి ఉంటుంది. ఇక ప్రతిపక్ష పార్టీలలో ఉంటే అధికార పార్టీ అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపైనా, నియోజకవర్గాల పార్టీని బలోపేతం చేయడంపై, ప్రజాక్షేత్రంలో తమ పట్టు సంపాదించుకోవడం పైన దృష్టి సారించాల్సి ఉంటుంది. అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న నిత్యం బిజీగా ఉండడం రాజకీయ పార్టీల నేతలకు సర్వసాధారణమైన అంశం.

ఫ్యామిలీ ఫంక్షన్స్ ఎంజాయ్ చేస్తున్న ఏపీ రాజకీయ నాయకులు
అలాంటి బిజీ పర్సన్స్ కాస్త రాజకీయాలకు బ్రేక్ ఇచ్చి ఫ్యామిలీతో గడిపితే ఎలా ఉంటుంది. ఫ్యామిలీ ఫంక్షన్స్ లో ఎలా ఉంటారు అనేది ప్రజలకు ఎప్పుడూ ఉండే ఆసక్తి. ఫ్యామిలీతో గడుపుతూ వారు ఏం చేసినా అది కూడా వారి అనుయాయులకు, అభిమానులకు ఆసక్తికర అంశమే. ఇక అలాంటి సందర్భం కనిపిస్తే, ఇష్టమైన రాజకీయ నాయకులు కాస్త ఫ్యామిలీతో సంతోషంతో గడిపితే అభిమానులకు పట్టపగ్గాలు ఉండవు. వారి ఎంజాయ్మెంట్ చూసి, వీరేదో ఎంజాయ్ చేసినట్టు సంబరపడిపోతుంటారు. ఇక ఇటీవల ఏపీ రాజకీయ నాయకులు ముఖ్యంగా అధికార వైసీపీ నేతలు ఫ్యామిలీ ఫంక్షన్స్ ను తెగ ఎంజాయ్ చేస్తున్నారు.
స్టైలిష్ గా రెడీ అయ్యి సతీమణితో కలిసి స్టెప్పులేసిన గుడివాడ అమర్నాథ్
ఇక తాజాగా ఎప్పుడు రాజకీయాలతో తీరికలేకుండా గడిపే, ప్రతిపక్ష పార్టీలపై తనదైన శైలిలో విరుచుకు పడే విశాఖపట్నం జిల్లా అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ కాస్త రాజకీయాలకు బ్రేక్ ఇచ్చారు. స్టైలిష్ గా రెడీ అయ్యారు. కుటుంబంతో కలిసి ఒక వివాహ వేడుకలో సంతోషంగా గడిపారు. సతీమణితో కలిసి స్టెప్పులేశారు. అలా ఇలా కాదు.. ఓ రేంజ్ లో, అదిరిపోయే గ్రేస్ తో చిరంజీవి పాటకు డాన్స్ ఇరగదీశారు.

శుభలేఖ రాసుకున్నా పాటకు డ్యాన్స్ చేసిన గుడివాడ అమర్నాథ్
తాజాగా తన మామయ్య కూతురు వివాహ వేడుకల్లో పాల్గొన్న గుడివాడ అమర్నాథ్ దంపతులు, ఆ వివాహ వేడుకలో సరదాగా గడిపారు. వివాహ వేడుకల్లో భాగంగా ఏర్పాటుచేసిన సంగీత్ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి కొండవీటి దొంగ సినిమాలోని శుభలేఖ రాసుకున్నా ఎదలో ఎపుడో అన్న పాటకు సతీ సమేతంగా గుడివాడ అమర్నాథ్ అదిరిపోయే స్టెప్పులు వేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో, గుడివాడ అమర్నాథ్ స్టైలిష్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

గతంలోనూ ఏపీ మంత్రి సురేష్ కుమార్తెతో కలిసి డ్యాన్స్
అమర్నాథ్ అభిమానులు, అనుచరులు అన్న ఏం చేసినా అద్భుతమే అంటూ తెగ కితాబిస్తున్నారు. రాజకీయాల్లో అయినా, రియల్ లైఫ్ లో అయినా అమర్నాథ్ స్టైలే వేరు అంటూ చెప్పుకుంటున్నారు. ఇక ఇటీవల కాలంలో ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కూడా తన కుమార్తె వివాహ వేడుక లో కుమార్తో కలిసి మంత్రి ఎంతో సంతోషంగా స్టెప్పులేశారు. అంతకు ముందు సోదరుడి పెళ్ళిలో మంత్రి పుష్ప శ్రీవాణి ధింసా నృత్యంతో అదరగొట్టారు. ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సతీమణి బుల్లెట్ బండెక్కి వచ్చేత్తా పా అంటూ స్టెప్పులేశారు. ఎప్పుడు రాజకీయాల్లో బిజీగా ఉండే నేతలు కూడా ఇలాంటి ఆటవిడుపు పొందాల్సిందే అని నెట్టింట వైరల్ అయిన వీడియోలను చూసిన పలువురు రాజకీయ నేతలు చెప్పుకుంటున్నారు.












Click it and Unblock the Notifications