ఆ విషయంలో ఏపీ విద్యార్థులే టాప్..?
నీతి ఆయోగ్ విదేశీ విద్యపై ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే అత్యధిక ఆసక్తి చూపుతున్నట్లు ప్రకటించింది. 'ఇంటర్నేషనలైజేషన్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా' నివేదిక ప్రకారం ఈ విషయాలను స్పష్టం చేసింది. విదేశాల్లో చదువుతున్న భారతీయ విద్యార్థుల్లో ఏపీ విద్యార్థుల సంఖ్య అత్యధికంగా ఉండటం గణాంకాల ద్వారా స్పష్టమైంది. ఈ నివేదిక భారతీయ ఉన్నత విద్య వ్యవస్థ, విదేశీ విద్యపై యువత ఆకాంక్షలు, ఆర్థిక ప్రభావాలపై సమగ్ర విశ్లేషణను అందించింది.
కాగా 2016లో ఆంధ్రప్రదేశ్ నుంచి విదేశాలకు వెళ్లిన విద్యార్థుల సంఖ్య 46,818గా ఉంది. అయితే 2018 నాటికి ఈ సంఖ్య 62,771కి చేరింది. కానీ కోవిడ్ ప్రభావంతో 2020లో ఇది 35,614కి తగ్గింది.అయినా కూడా మహమ్మారి ప్రభావం ఉన్నప్పటికీ విదేశీ విద్యకు వెళ్లే విద్యార్థుల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానాన్ని కోల్పోలేదని నివేదిక స్పష్టం చేసింది. ఇది ఏపీ విద్యార్థుల గ్లోబల్ ఎడ్యుకేషన్‌పై ఉన్న నిరంతర ఆసక్తిని ప్రతిబింబిస్తోందని నిపుణులు చెబుతున్నారు.

విదేశాల్లో చదువుతున్న విద్యార్థుల సంఖ్యలో ఆంధ్రప్రదేశ్ తర్వాతి స్థానాల్లో ఉన్న రాష్ట్రాలు:
పంజాబ్
మహారాష్ట్ర
గుజరాత్
తమిళనాడు
ఢిల్లీ
కర్ణాటక
కేరళ
ఉత్తరప్రదేశ్
అయితే, టెక్నికల్ కోర్సులు, ఇంజినీరింగ్, ఐటీ, హెల్త్ సైన్సెస్ వంటి రంగాల్లో ఏపీ విద్యార్థుల ఆధిక్యం స్పష్టంగా కనిపిస్తోందని నివేదిక పేర్కొంది.
2024 నాటికి మొత్తం 13.35 లక్షల మంది భారతీయ విద్యార్థులు విదేశాల్లో చదువుతున్నారు. వీరిలో 8.5 లక్షల మంది మాత్రమే అమెరికా, యునైటెడ్ కింగ్డమ్, కెనడా, ఆస్ట్రేలియా దేశాలకు పరిమితమయ్యారు. అలానే 2016-2024 మధ్యకాలంలో విదేశీ విద్యార్థుల సంఖ్యలో 8.84% వృద్ధి నమోదైంది. ఇది ప్రపంచవ్యాప్తంగా భారతీయ విద్యార్థుల డిమాండ్ ఎంతగా పెరిగిందో చూపిస్తోంది.
ఇక నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం భారతీయ విద్యార్థులు ఏటా సుమారు రూ.6.2 లక్షల కోట్లు విదేశీ విద్యపై ఖర్చు చేస్తున్నారు. ఇది భారత స్థూల జాతీయోత్పత్తి (GDP)లో దాదాపు 2 శాతంకు సమానం అని వెల్లడవుతోంది. ఈ ఖర్చుల కారణంగానే భారతదేశానికి సంబంధించిన వాణిజ్య లోటులో సుమారు 75% వాటా ఏర్పడుతోందని నివేదిక పేర్కొంది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన భారం పడుతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఈ నివేదికలో మరో ఆందోళనకర అంశం కూడా వెలుగులోకి వచ్చింది. భారత్‌కు ఒక విదేశీ విద్యార్థి వస్తే.. అదే సమయంలో 28 మంది భారతీయులు విదేశాలకు వెళ్తున్నారు. ఇది భారతీయ ఉన్నత విద్య సంస్థలు అంతర్జాతీయంగా ఇంకా పోటీతత్వాన్ని సాధించాల్సిన అవసరాన్ని స్పష్టంగా చూపిస్తోంది.
ఎందుకు ఏపీ విద్యార్థులే ఎక్కువగా విదేశాలకు?
నిపుణుల విశ్లేషణ ప్రకారం..
ఇంజినీరింగ్, టెక్నాలజీపై ఏపీ విద్యార్థుల ఆసక్తి
గ్లోబల్ ఉద్యోగ అవకాశాలపై దృష్టి
అంతర్జాతీయ యూనివర్సిటీల బ్రాండ్ విలువ
స్టూడెంట్ లోన్స్, ఏజెంట్ల సులభ లభ్యత
గ్రామీణ-పట్టణ ప్రాంతాల్లో కూడా అవగాహన పెరగడం
వంటి అంశాలు విదేశీ విద్యకు ఏపీ విద్యార్థులను మరింత ఆకర్షిస్తున్నాయి.
-
గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగుతున్నారా - అయితే, ఇది మీ కోసమే..!! -
భారత్ కు మెషిన్ గన్స్ పంపించిన ఇజ్రాయెల్.. పాకిస్థాన్ పని ఖతం.. -
భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన పాకిస్థాన్ -
లాస్ట్ ఛాన్స్: కేంద్రీయ విద్యాలయ సీట్లు, రేపే ఆఖరు గడువు! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం












Click it and Unblock the Notifications