వైసీపీకి మరో షాక్-తిరుపతిలోనూ కూటమి హవా..!
ఏపీలో అధికారం కోల్పోయాక వరుస ఎదురుదెబ్బలు తింటున్న వైసీపీకి మన్నిపల్ ఎన్నికలు మరిన్ని షాకులిస్తున్నాయి. రాష్ట్రంలో తాజాగా జరిగిన డిప్యూటీ మేయర్లు, వైస్ ఛైర్మన్ల ఎన్నికల్లో కూటమి అభ్యర్ధులు ఎక్కడికక్కడ వైసీపీకి ఓటమి రుచిచూపిస్తున్నారు. అదీ విచిత్రంగా వైసీపీ మెజార్టీ ఉన్న కౌన్సిళ్లలో కూటమి అభ్యర్ధులుగా వరుస విజయాలు నమోదు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇవాళ తిరుపతి కార్పోరేషన్ లోనూ ఇదే సీన్ రిపీట్ అయింది.
తిరుపతి కార్పోరేషన్ లో డిప్యూటీ మేయర్ ఎన్నికలో ఇవాళ కూటమి అభ్యర్ధి మునికృష్ణ విజయం సాధించారు. ఇవాళ జరిగిన ఎన్నికల్లో కూటమి అభ్యర్ధి మునికృష్ణకు 26 ఓట్లు రాగా.. వైసీపీ అభ్యర్ధి భాస్కర్ రెడ్డికి 22 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఎక్స్ అఫీషియో ఓటర్లతో కలిపి మొత్తం 50 ఓట్లు ఉండగా.. ఇందులో కూటమి అభ్యర్ధికి 26, వైసీపీ అభ్యర్ధి 22 ఓట్లు సాధించారు.దీంతో కూటమి అభ్యర్ధి మునికృష్ణ డిప్యూటీ మేయర్ గా ఎన్నికైట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు.

వాస్తవానికి తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక నిన్న జరగాల్సి ఉండగా కోరం లేక వాయిదా పడింది. నిన్న కొందరు వైసీపీ కార్పోరేటర్లను టీడీపీ నేతలు బస్సులో నుంచి కిడ్నాప్ చేసి తరలించుకుపోయారు. వీరిని తమ వైపు తిప్పుకున్నారు. దీనిపై వైసీపీ అభ్యంతరాలు వ్యక్తం చేసినా అధికారులు పట్టించుకోలేని నేతలు ఆరోపించారు. నిన్న అర్ధరాత్రి కూడా వైసీపీ, టీడీపీ నేతల మధ్య దాడులు, ప్రతిదాడులు జరిగాయి. చివరికి ఇవాళ కౌన్సిల్ సమావేశంలో కూటమి అభ్యర్ధికే మెజార్టీ లభించింది. దీంతో మేయర్ గా ఉన్న వైసీపీ నేత శిరీష భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి.
-
ఏపీలో ఆ జిల్లాలు హాట్ స్పాట్స్- అత్యధిక ఉష్ణోగ్రత -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం!












Click it and Unblock the Notifications