అయ్యయ్యో.. తలక్రిందులైన ఆరా మస్తాన్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు... దుకాణం బంద్ చేసుకోమంటున్న తెలుగుతమ్ముళ్ళు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ఆరా సర్వే సంస్థ వెల్లడించిన విషయం తెలిసిందే. ఏపీలో అధికారం వైసీపీ దేనని బల్ల గుద్ది మరీ చెప్పిన ఆరా మస్తాన్ సర్వే ఇప్పుడు తలకిందులైంది. వైసిపికి 94 నుండి 104 స్థానాలు, టీడీపీ కూటమికి 71 నుంచి 81 స్థానాలు వస్తాయని బల్లగుద్ది మరీ చెప్పిన ఆరా మస్తాన్ ఈసారి టీడీపీ కూటమి ప్రతిపక్షానికి పరిమితం కావచ్చు అంటూ అంచనా వేశారు.

వైసీపీ గెలుస్తుందని చెప్పిన ఆరా మస్తాన్ ఎగ్జిట్ పోల్స్
తన సర్వే తప్పు కాదని చాలా స్ట్రాంగ్ గా చెప్పారు. అయితే ప్రస్తుతం ఆరా మస్తాన్ సర్వే తలకిందులైంది. అంతేకాదు వైసిపి గెలుపొందే 104 స్థానాల జాబితా ఇదేనంటూ చేసిన సర్వేకు సంబంధించి గెలుపొందే నియోజకవర్గాల జాబితా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఇక ఏపీలో వైసిపి గెలుస్తుందని చెప్పిన ఆరా మస్తాన్, ఏపీలో పలు మంత్రులు ఓటమిపాలు అవుతారంటూ చెప్పి తన ఎగ్జిట్ పోల్స్ నిజమని నమ్మించే ప్రయత్నం కూడా చేశారు.

AP Assembly Results 2024 Aara Mastan exit polls results upside down Tdp cadre satires on aara survey

తప్పులో కాలేసిన ఆరా మస్తాన్ .. మరో లగడపాటిలా
తన సర్వే సంస్థ చేసిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తప్పు కావని చెప్పారు. ఏపీలో మహిళలు వైసీపీకి పెద్దపీట వేశారని ఆయన చెప్పుకొచ్చారు. అయితే ఆరా మస్తాన్ సర్వే సంస్థ కొద్దిగా కాదు పూర్తిగా తప్పులో కాలేసిందని ఎగ్జాక్ట్ పోల్స్ ఫలితాలు వెల్లడిస్తున్నాయి. ఇక ఆరా మస్తాన్ కూడా మరో లగడపాటి లా తయారయ్యారని ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ఆయనను ఉతికి ఆరేస్తున్నారు.

సోషల్ మీడియాలో టార్గెట్ చేస్తున్న నెటిజన్లు
2014 ఎన్నికల తర్వాత లగడపాటి ఎలాగైతే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఎగ్జిట్ పోల్స్ ఇచ్చాడో.. ఇప్పుడు ఆరా మస్తాన్ కూడా అలాగే ఇస్తున్నాడని.. 2024లో ఆరా మస్తాన్ మరో లగడపాటి కాబోతున్నారంటూ కొందరు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేస్తున్నారు. గతం కంటే పెరిగిన పోలింగ్ అది వైసీపీకి అనుకూలంగా మారిందని ఆరా మస్తాన్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

దుకాణం మూసుకో భయ్యా అంటున్న తెలుగు తమ్ముళ్ళు
మొత్తానికి ఆయన అంచనాలు తప్పు కావడంతో ఇప్పుడు ఏం చెప్తారు భయ్యా అంటూ ప్రశ్నిస్తున్నారు టిడిపి తమ్ముళ్ళు. ఇంకెందుకు భయ్యా తప్పుడు సర్వే ఫలితాలను ఇచ్చే మీ ఆరా సంస్థను మూసుకోండి అంటూ మరికొందరు పోస్టులు పెడుతున్నారు. ఇంకొందరైతే సర్వే ఫలితాన్ని ఎంతకు అమ్మావు భయ్యా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇక నీ సర్వే సంస్థ ఫలితాల గురించి ఆరా తీయడం భవిష్యత్తులో జనాలు మానేస్తారని మరికొందరు సెటైర్లు వేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+