చంద్రబాబే కరెక్ట్-సుప్రీం కామెంట్స్ ను తప్పుబట్టిన పురందేశ్వరి-"బావ" సారూప్యత అన్న వైసీపీ !
ఏపీలో తిరుమల లడ్డూ వ్యవహారంపై రాజకీయంగా మాటల యుద్దం కొనసాగుతోంది. తాజాగా లడ్డూ కల్తీ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చిన సీఎం చంద్రబాబుపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలపై మిశ్రమ స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీ ఛీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి దీనిపై స్పందించారు. చంద్రబాబు వ్యాఖ్యల్ని సమర్థించిన పురందేశ్వరి, సుప్రీంకోర్టు ఆయనపై చేసిన వ్యాఖ్యలు తప్పుబట్టారు.
కేసు కూడా నమోదు కాకముందే తిరుమల లడ్డూకు వాడిన నెయ్యి కల్తీ అయిందంటూ ఆధారాలు లేకుండా ఆరోపణలు చేశారంటూ సుప్రీంకోర్టు సీఎం చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై స్పందించిన పురందేశ్వరి..ఏం జరిగిందో అదే చంద్రబాబు మాట్లాడారని తెలిపారు. సీఎం వ్యాఖ్యలపై కోర్టు కామెంట్ చేయడం సమంజసంగా లేదని ఆమె తెలిపారు.సీఎం మాట్లాడకుండా ఉండాల్సింది అనడం సరికాదన్నారు.

రాజ్యాంగ పదవిలో ఉన్నందున సీఎం చంద్రబాబుకు మాట్లాడే హక్కు ఉంటుందని పురందేశ్వరి తెలిపారు. రాష్ట్రానికి సంబంధించిన ఏ అంశంపైనైనా సీఎం మాట్లాడతారంటూ ఆయనను సమర్థించారు. చట్టవిరుద్ధంగా ఏం మాట్లాడకూడని, కానీ లడ్డూ విషయంలో మాత్రం చంద్రబాబు జరిగిందే చెప్పారని పురంధేశ్వరి వెల్లడించారు. తద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు తన పరిధిలోనే ఈ వ్యాఖ్యలు చేశారని చెప్పకనే చెప్పారు.
మరోవైపు పురందేశ్వరి వ్యాఖ్యలపై వైసీపీ స్పందించింది. చంద్రబాబును వెనకేసుకొస్తూ సుప్రీంకోర్టు వ్యాఖ్యల్ని తప్పుబట్టిన పురందేశ్వరి తీరుపై వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ట్వీట్ చేశారు. ఇది "బావ" సారూప్యతే అన్నారు. పురందేశ్వరి వ్యాఖ్యలపై ఓ న్యూస్ ఆర్టికల్ ను తన ట్వీట్ కు జత చేస్తూ ఈ కామెంట్ చేశారు.
-
Polavaram:పోలవరంకు మహర్దశ - చంద్రబాబు ప్లాన్ అదుర్స్..!! -
Amaravati: అమరావతి పేరు మార్పు..! సర్కార్ ఉత్తర్వులు జారీ..! -
చంద్రబాబుకు జాతీయ పార్టీ నేత సవాల్: మణిపూర్ లా తయారవుతాయి -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ?












Click it and Unblock the Notifications