AP Schools : దసరా సెలవుల్లో స్కూళ్లు తెరిస్తే కఠిన చర్యలే..!

ఏపీలో ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు ప్రభుత్వం ఈ నెల 14 నుంచి 24 వరకూ దసరా సెలవులు ప్రకటించింది. అయితే ప్రభుత్వ స్కూళ్లు మూతపడినా, పలు చోట్ల ప్రైవేటు స్కూళ్లు మాత్రం ఇంకా పనిచేస్తూనే ఉన్నాయి. దీంతో ప్రభుత్వం ఆయా స్కూళ్లపై సీరియస్ అవుతోంది. అదే సమయంలో ఏపీ బాలల హక్కుల కమిషన్ కూడా ప్రైవేటు పాఠశాలల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రభుత్వ ఆదేశాలు పాటించని స్కూళ్లపై కఠిన చర్యలు తప్పవని ఇవాళ హెచ్చరించింది.

ఏపీలోని అన్ని ప్రయివేటు, ప్రభుత్వ విద్యాసంస్థలు రాష్ట్ర విద్యా శాఖ అధికారులు ప్రకటించిన దసరా పండుగ సెలవులను తప్పని సరిగా పాటించి తీరాలని బాలల హక్కుల కమిషన్ స్పష్టం చేసింది. అలా కాకుండా దసరా సెలవుల్లో విద్యా సంస్థలు తరగతులు నిర్వహించినా లేదా ఆన్లైన్ తరగతులు నిర్వహించినా ఆయా స్కూళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్ పర్సన్ కేసలి అప్పారావు హెచ్చరించారు.

ap child rights commission warned private schools not to open during dussehra holidays

మంగళగిరిలోని రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్లో కమిషన్ చైర్ పర్సన్ కేసలి అప్పారావు .. కొన్ని జిల్లాలలో సెలవుల విషయములో ప్రభుత్వ నియమ నిబంధనలను కొన్ని ప్రైవేటు కార్పోరేట్ పాఠశాలలు పాటించడం లేదని కమిషన్ కార్యాలయానికి ఫిర్యాదులు అందుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో కొన్ని కార్పొరేట్ విద్యా సంస్థలు ఆన్ లైన్ తరగతులు నిర్వహిస్తున్నారని, మరికొన్ని విద్యా సంస్థలు మొబైల్ ఫోన్ ద్వారా హోమ్ వర్కులు చేయమని విద్యార్ధులపై ఒత్తిడి తీసుకొని వస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

ఎక్కడైనా పాఠశాలలు ప్రత్యేక తరగతులు లేదా ఆన్లైన్ తరగతులు లేదా ఆన్లైన్ పరీక్షలు నిర్వహిస్తూ ఉంటే రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ వారి మెయిల్ కి [email protected] కు మెయిల్ ద్వారా ఫిర్యాదు చేయాలని ఆయన కోరారు. అలాగే మండల ,జిల్లా స్థాయి విద్యా శాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని, తరగతులు నిర్వహిస్తున్న పాఠశాలలను గుర్తించి తగు శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని బాలల హక్కుల చైర్ పర్సన్ కేసలి అప్పారావు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయం మీద అన్ని జిల్లాల కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+