పవన్ నోట మళ్లీ శాంతి భద్రతల మాట-రాజ్యాంగ దినోత్సవం వేళ ట్వీట్..! డిలీట్..
ఏపీలో శాంతి భద్రతలకు సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గతంలో చేసిన వ్యాఖ్యలు, ట్వీట్లు ఏ రేంజ్ లో వైరల్ అయ్యాయో అందరూ చూశారు. అప్పట్లో రాష్ట్రంలో శాంతి భద్రతల్ని కాపాడలేకపోతే తప్పుకోవాలని, తానే హోంమంత్రి బాధ్యతలు తీసుకుంటానని, చర్యలు తీసుకోమంటే పోలీసులు కుల,మతాల ప్రస్తావన చేస్తున్నారని పవన్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. వాటి దెబ్బకు ప్రభుత్వమే ఆత్మరక్షణలో పడాల్సి వచ్చింది. తర్వాత ఆ గొడవ సద్దుమణిగింది.
ఇప్పుడు మరోసారి జనసేనాని పవన్ కళ్యాణ్ శాంతి భద్రతల అంశాన్ని మళ్లీ కెలికారు. ఈ మేరకు ఆయన ఎక్స్ లో ఓ ట్వీట్ పెట్టారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా శాంతి భద్రతల అవసరాన్ని గుర్తు చేస్తూ పవన్ కళ్యాణ్ ఈ ట్వీట్ చేశారు. దీంతో పవన్ ట్వీట్ వైరల్ అవుతోంది. ఈ ట్వీట్ లో పవన్ శాంతి భద్రతలపై రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చెప్పిన మాటల్ని గుర్తు చేశారు. "లా అండ్ ఆర్డర్ అనేది శరీర రాజకీయాలకు ఔషధం మరియు శరీర రాజకీయాలు అనారోగ్యం పాలైనప్పుడు, ఔషధం తప్పనిసరిగా ఇవ్వాల్సిందే" అంటూ పవన్ ఈ ట్వీట్ చేశారు.

గతంలో రాష్ట్రంలో శాంతి భద్రతలపై పలు సంచలన వ్యాఖ్యలు చేయడంతో పాటు ట్వీట్లు కూడా పెట్టిన పవన్ కల్యాణ్ ఇప్పుడు ఈ ట్వీట్ ఎవరి గురించి పెట్టారన్న చర్చ జరుగుతోంది. శరీరానికి కూడా లా అండ్ ఆర్డర్ అవసరమే అంటూ అంబేద్కర్ చెప్పిన మాటను గుర్తు చేస్తూ పవన్ ఎవరిపై ఈ ట్వీట్ పెట్టి ఉంటారని జనం చర్చించుకుంటున్నారు. అయితే రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా శాంతి భద్రతల ఆవశ్యకతను అంబేద్కర్ మాటలతో పవన్ గుర్తుచేశారని ఆయన అభిమానులు చెప్పుకుంటున్నారు.
అయితే కాసేపటికే ఆ ట్వీట్ ను ఆయన డిలీట్ చేశారు.












Click it and Unblock the Notifications