Raghurama: కర్మంటే ఇదే.. ఆ భయానక దాడిని గుర్తుచేసుకున్న రఘురామ..!

ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ పెద్దల్ని ఎదిరించి జైలు పాలైన అప్పటి ఎంపీ రఘురామకృష్ణంరాజును కస్టడీలో సీఐడీ అధికారులు చిత్రహింసలకు గురిచేశారు. ఈ మొత్తం వ్యవహారం సమన్వయం చేసిన అప్పటి సీఐడీ ఏసీపీ విజయ్ పాల్ తాజాగా అరెస్టు అయి జైలు పాలయ్యారు. దీనిపై ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్ గా ఉన్న రఘురామరాజు స్పందించారు. తనను పుట్టినరోజు అరెస్టు చేసి, జైలుకు పంపి, అక్కడా చిత్రహింసలు పెట్టిన విజయ్ పాల్ ఇప్పుడు అలాగే అరెస్టు అయి అదే గుంటూరు జైలుకు వెళ్లారని, కర్మ ఎవరినీ వదిలిపెట్టదని రఘురామ వ్యాఖ్యానించారు.

ఐపీఎస్ లు సీతారామాంజనేయులు, సునీల్ నాయక్, పీవీ సునీల్ కుమార్ కుట్రను రచిస్తే దాన్ని అమలు చేసిన వ్యక్తి విజయ్ పాల్ అని రఘురామ తెలిపారు. తనకున్న సీఆర్పీఎఫ్ భద్రతా సిబ్బందిని తనను నిర్బధించిన గది నుంచి బయటికి పంపి ఆ తర్వాత హోటల్ కు పంపేశారన్నారు. తన దగ్గరున్న సీఐ సత్యనారాయణ, హెడ్ కానిస్టేబుల్ మీరా వలిని కిందకు పిలిచి తన వద్దకు ముసుగు వ్యక్తుల్ని పంపారని, వారు తనను చితక బాదారని రఘురామ అప్పటి భయానక ఘటనను గుర్తుచేసుకున్నారు.
ఆ తర్వాత సత్యనారాయణ, మీరా వలి వచ్చి ఏంటి రాజు గారూ.. మంచాన్ని ఇలా చేశారని ఏమీ తెలియనట్లు అడిగారన్నారు.

ap deputy speaker raghurama Krishnam raju terms former cid asp Vijay paul arrest jail as karma

దాడి జరిగిన సమయంలో తన ఛాతీపై ఎవరో కూర్చున్నారని, ఆ బరువుకు మంచం కోళ్లు విరిగి తన కాళ్లు పైకి వచ్చాయని రఘురామ తెలిపారు. వారిని ఇప్పుడు గుర్తుపడతానన్నారు. కాబట్టి పది రోజులు ఆలస్యమైనా నిందితులు దొరుకుతారని, వారిని శిక్షిస్తారన్న నమ్మకం తనకుందన్నారు. అలాగే తనపై దాడికి సూత్రధారి అయిన అప్పటి సీఐడీ అదనపు డీజీ పీవీ సునీల్ కుమార్ తెలంగాణలో ప్రభాకర్ రావులా విదేశాలకు పారిపోయే ప్రమాదం ఉందని, ఆయనకు లుకౌట్ నోటీసులు ఇవ్వాలని పోలీసుల్ని రఘురామ కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+