AP DGP Twitter : ఏపీ డీజీపీ ట్విట్టర్ ఖాతాలో బూతు బొమ్మలు- డీఐజీ వార్నింగ్..
ఏపీ డీజీపీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో తాజాగా బూతు బొమ్మలు ప్రత్యక్షమయ్యాయి. నిత్యం యాక్టివ్ గా ఉంటూ ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు, అధికారిక సమాచారాన్ని పోస్ట్ చేసే డీజీపీ ట్విట్టర్ ఖాతాలో ఒక్కసారిగా అసభ్య కంటెంట్ షేర్ అవుతోంది. దీన్ని టీడీపీకి చెందిన కొందరు ఈ విషయాన్ని బయటపెట్టడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది.
డీజీపీ అధికారిక ట్విట్టర్ ఖాతా హ్యాక్ కు గురైనట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు సైబర్ క్రైమ్ సెల్ లో ఫిర్యాదు కూడా చేశారు. దీంతో రంగంలోకి దిగిన నిపుణులు డీజీపీ ఖాతాను హ్యాక్ చేసిన వారిని గుర్తించే పనిలో పడ్డారు. హ్యాక్ చేసిన వారిని ఎట్టిపరిస్దితుల్లో వదిలిపెట్టబోమని, కఠిన చర్యలు తప్పవని సాంకేతిక విభాగం డిఐజి పి.హెచ్‌డి. రామకృష్ణ హెచ్చరించారు. దీంతో ఈ వ్యవహారం సీరియస్ అవుతోంది.

వాస్తవానికి 2019లో dgpapofficial పేరుతో క్రియేట్ చేసిన ట్విటర్ ఐడీ .. 2020 ఫిబ్రవరి నుండి పూర్తిగా వాడుకంలో లేదు. ఇలా యాక్టివ్ గా లేని అకౌంట్‍ను హ్యాక్ చేసి తప్పుడు ఫోటోలు, అసభ్యకరమైన ఫోటోలకు లైకులు కొడుతూ ఉదేశపూర్వకంగా సోషల్ మీడియా లో ప్రచారం చేస్తున్నట్లుగా గుర్తించినట్లు అధికారులు ఇవాళ వెల్లడించారు. దీనిపైన సైబర్ క్రైమ్ విభాగంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ప్రకటించారు. హ్యాకర్లను గుర్తించి చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఆ లోపు సదరు అసభ్య ఫొటోలకు లైకులు కొట్టడంతో ఇవి కాస్తా వైరల్ అవుతున్నాయి.













Click it and Unblock the Notifications