ఏపీలో మీరు తాగే మందు క్వాలిటీదేనా ? ఇలా తెలుసుకోండి...!

ఏపీలో కల్తీ మద్యం ఆనవాళ్లు బయటపడిన నేపథ్యంలో మందుబాబులకు ఏది అసలైనదో, ఏది నకిలీదో తెలుసుకోలేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అలాగని మద్యం షాపుల్లో అమ్మే బాటిళ్లపై ప్రశ్నించే పరిస్దితి లేదు. ఈ నేపథ్యంలో కల్తీ మద్యానికి చెక్ పెట్టేలా ప్రభుత్వం తాజాగా క్యూఆర్ కోడ్ విధానం అమలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించింది.

మద్యం కొనుగోలు చేసే వినియోగదారులు నకిలీ మద్యం బారిన పడకుండా ఉండేందుకు ఎక్సైజ్‌ శాఖ "మీరు తాగే మద్యం నిజమైనదేనా తెలుసుకోండి" అనే అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమం లో భాగంగా విజ‍యవాడ వెటర్నరీ కాలనీలో ఉన్న ఒక రిటైల్‌ మద్యం దుకాణంలో అవగాహన పోస్టర్‌ను ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ శ్రీధర్‌ ఆవిష్కరించి స్వయంగా విక్రయ కేంద్రానికి అంటించారు. ఈ కరపత్రం‌లో ఏపీ ఎక్సైజ్‌ సురక్ష యాప్‌ ద్వారా వినియోగదారులు తాము కొనుగోలు చేసిన మద్యం బాటిల్‌ నిజమైనదేనా కాదా అన్నది ఎలా తెలుసుకోవాలో నాలుగు సులభమైన దశల్లో వివరించారు.

AP Excise Department Launches Know What You Drink Campaign to Curb Spurious Liquor

ఈ యాప్‌ ద్వారా బాటిల్‌ క్యాప్‌పై ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్‌ చేస్తే వెంటనే ఆ బాటిల్‌ అసలైనదేనా కాదా అనే సమాచారాన్ని చూపిస్తుంది. అలాగే ఆ బాటిల్‌ బ్యాచ్‌ నంబర్‌, తయారీ తేదీ, గరిష్ఠ చిల్లర ధర వంటి వివరాలు కూడా అందిస్తుంది. ప్రస్తుతం ఈ యాప్‌ ఇండియన్‌ మేడ్‌ ఫారిన్‌ లిక్కర్‌ ఉత్పత్తులకే వర్తిస్తుందని, బీర్‌కు ఇది వర్తించదని డైరెక్టర్‌ స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని లైసెన్స్‌ పొందిన మద్యం దుకాణాలలో "మీరు తాగే మద్యం నిజమైనదేనా తెలుసుకోండి" పోస్టర్లను స్పష్టంగా ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్‌ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ కార్యక్రమం ద్వారా వినియోగదారులు మద్యం కొనుగోలు సమయంలో జాగ్రత్తగా, అవగాహనతో వ్యవహరించే అవకాశం ఉంది.

AP Excise Department Launches Know What You Drink Campaign to Curb Spurious Liquor

రాష్ట్రంలో తాజాగా కల్తీ మద్యం బయటపడిన నేపథ్యంలో తీసుకొచ్చిన క్యూఆర్ కోడ్ విధానాన్ని మందుబాబులు సక్రమంగా వినియోగించుకుంటే అసలు ఏదో నకిలీ ఏదో ఇట్టే తేలిపోయే అవకాశం ఉంది. అలాగే ప్రభుత్వంపై కల్తీ మద్యం విమర్శలకు కూడా చెక్ పెట్టేందుకు వీలు కలగనుందని అధికారులు చెప్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+