ఏపీలో దసరా సెలవుల అధికారిక ప్రకటన-ఉత్తర్వుల జారీ..!
ఏపీలో ప్రభుత్వం అధికారికంగా దసరా సెలవులపై ఇవాళ ప్రకటన చేసింది. ఇప్పటివరకూ అకడమిక్ క్యాలెండర్ ప్రకారం దసరా సెలవులపై ఊహాగానాలు రాగా .. ఇవాళ మాత్రం పాఠశాల విద్యాశాఖ అధికారికంగా దసరా సెలవులపై ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో విద్యార్ధులకు రెండు సెలవు దినాలతో పాటు మొత్తం 12 రోజుల పాటు దసరా సెలవులు రాబోతున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఈ ఏడాది దసరా పండుగ అక్టోబర్ 12న రానుంది. అయితే రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు మాత్రం ఈ నెల 3 నుంచి 12 వరకూ దసరా సెలవుల్ని ప్రకటించారు. దీంతో పాటు అక్టోబర్ 2న అంటే రేపు గాంధీ జయంతి కావడంతో ఎలాగో సెలవు ఉంటుంది. అలాగే 13వ తేదీ ఆదివారం వచ్చింది. ఈ నేపథ్యంలో రెండు పబ్లిక్ హాలిడేలతో కలుపుకుని మొత్తం 12 రోజుల పాటు సెలవులు ఇచ్చినట్లు అవుతుంది. దసరా పండుగ తర్వాత స్కూళ్లను అక్టోబర్ 14న పునఃప్రారంభించనున్నారు.

వివిధ ఉపాధ్యాయ సంఘాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఈనెల 3 నుంచి 13వ తేదీ వరకూ దసరా సెలవుల్ని ప్రకటిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు పేరుతో ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇందులో దసరా సెలవుల వివరాలను రాష్ట్రంలోని అన్ని జిల్లా విద్యాశాఖాధికారులు తమ పరిధిలోని అన్ని స్కూళ్లకు పంపాలని ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత, జడ్పీ, ఎంపీపీ, ఎయిడెడ్, ప్రైవేట్ అన్ ఎయిడెడ్ స్కూల్స్ కూ ఈ ఆదేశాలు వర్తిస్తాయని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications