ఏపీ సచివాలయాల్లో బదిలీలపై తాజా మార్గదర్శకాలు-కీలక మార్పులివే.!
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సచివాలయ వ్యవస్ధలో మార్పుల కోసం కూటమి ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా సచివాలయాల హేతుబద్ధీకరణ, ఉద్యోగుల వర్గీకరణ పూర్తి చేసిన ప్రభుత్వం ఇప్పుడు బదిలీలకు తెర లేపింది. దీనిపై ఇప్పటికే ఈ నెల 12న మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం వాటికి కొనసాగింపుగా ఇవాళ మరో విడత మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మేరకు సర్కులర్ విడుదలైంది.
గ్రామ, వార్డ్ సచివాలయాల వర్గీకరణ, ఉద్యోగుల సర్దుబాటుపై ఇవాళ జారీ చేసిన ఉత్తర్వుల్లో పలు మార్గదర్శకాలను ఇచ్చారు. వీటిలో
1. 2025 మే 31 నాటికి నిరంతరంగా 5 సంవత్సరాలు పనిచేసినవారిని తప్పనిసరిగా బదిలీ చేయాలి.
2. 5 సంవత్సరాలు కాలం పూర్తికాని వారు వ్యక్తిగత అభ్యర్థన మేరకు బదిలీకి అర్హులు.
3. ఉద్యోగిని తన స్వగ్రామ మండలంలో పోస్టింగ్ ఇవ్వరాదు.
4. HRMS పోర్టల్‌లో రెండు మాడ్యూళ్లు క్రియాశీలం చేశారు - జిల్లాల HODలు మరియు MPDOs/MCs ద్వారా.
5. 5 సంవత్సరాలు పూర్తికాని ఉద్యోగులకై ఆన్‌లైన్ ద్వారా బదిలీ అభ్యర్థన సమర్పణ సదుపాయం ఉంటుంది.
6. ఖాళీల వివరాలు HRMS పోర్టల్‌లో అందుబాటులో ఉంటాయి.
7. బదిలీ ఉత్తర్వులు జిల్లా కలెక్టర్లు జారీచేయాలి.
8. బదిలీ యూనిట్ - పాత జిల్లాల ఆధారంగా ఉంటుంది.

9. ఈ కేటగిరీలకు ప్రాధాన్యత ఇవ్వాలి:
- -దృష్టిహీనులు
- -మానసికంగా వెనుకబడి ఉన్న పిల్లల తల్లిదండ్రులు
- -గిరిజన ప్రాంతాల్లో 2 ఏళ్ళకుపైగా పనిచేసినవారు
- 40% కంటే ఎక్కువ వైకల్యంతో ఉన్నవారు
- దీర్ఘకాలిక అనారోగ్య కారణాలతో బదిలీ కోరినవారు
- కంటుబడిన ఉద్యోగినులు
10. దృష్టిహీనులైన వారు స్వచ్చందంగా కోరితే మాత్రమే బదిలీ చేయాలి.
11. భార్యాభర్తలిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులైతే ఒకే ప్రాంతంలో పోస్టింగ్‌కి ప్రాధాన్యత.
12. ITDA మరియు వెనుకబడిన ప్రాంతాల్లో ఖాళీలు ముందుగా నింపాలి.
13. ITDA ప్రాంతాల్లో బదిలీ అయినవారిని ప్రత్యామ్నాయ ఉద్యోగి జాయిన్ చేసిన తరువాతే రిలీవ్ చేయాలి.
14. బదిలీైన వారు సూచించిన స్థలానికి చేరుకోకపోతే క్రమశిక్షణ చర్యలు చేపట్టాలి.
15. బకాయి చెల్లింపులు చెల్లించకుండా ఏ ఉద్యోగినీ రిలీవ్ చేయకూడదు.
16. మొత్తం బదిలీ ప్రక్రియను 30.06.2025లోపు పూర్తి చేయాలి.
17. HRMSలో అన్ని ఉద్యోగుల వివరాలను 10.07.2025లోపు అప్‌డేట్ చేయాలి.
అలాగే జిల్లాలోపలే బదిలీలకు తాత్కాలిక షెడ్యూల్ కూడా ఇచ్చారు.
1 HOD మాడ్యూళ్లో డేటా నమోదు-జిల్లా HOD-జూన్ 16-18
2 MPDO/MC ద్వారా రేషనలైజేషన్ డేటా నమోదు-MPDO/MC-జూన్ 16-18
3 ఆన్‌లైన్ బదిలీ అభ్యర్థనలు-ఉద్యోగులు-జూన్ 22-24
4 అభ్యర్థనలు పరిశీలన మరియు బదిలీలు-నియామక అధికారి-జూన్ 25-29
5 ఫిర్యాదుల పరిష్కారం-జిల్లా కలెక్టర్-జూన్ 30 లోపు












Click it and Unblock the Notifications