Group 1 :గ్రూప్ 1 అధికారులకు ఏపీ సర్కార్ షాక్..! సీఎస్ కు హైకోర్టు పిలుపుతో..!
ఏపీలో 2018లో గ్రూప్ 1 (Group 1) పరీక్ష విషయంలో అక్రమాలు చోటు చేసుకున్నాయన్న ఆరోపణలపై హైకోర్టు ఆదేశాలతో సిట్ విచారణ చేస్తున్న వేళ .. మరో కీలక పరిణామం చోటు చేసుకంది. అప్పట్లో ఉద్యోగాలు పొందిన వారిని అప్రాధాన్య పోస్టుల్లోకి మార్చాలంటూ గత విచారణలో హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా ప్రభుత్వం దాన్ని అమలు చేయలేదు. దీంతో ఈ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు.. ఇవాళ సీఎస్ విజయానంద్ ను హైకోర్టుకు పిలిపించి వివరణ తీసుకుంది.
ఈ పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే స్పందించింది. 2018 గ్రూప్ 1 పరీక్షలో ఉత్తీర్ణులై ప్రస్తుతం వివిధ శాఖల్లో కీలక పోస్టుల్లో ఉన్న అధికారుల్ని వెంటనే అప్రాధాన్య పోస్టుల్లోకి మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అందులో సదరు గ్రూప్ 1 అధికారుల్ని అప్రాధాన్య పోస్టుల్లోకి మారుస్తున్నట్లు ఇవాళ సాయంత్రం 7 గంటల్లోకా తనకు నివేదిక పంపాలని ఉన్నతాధికారులకు సీఎస్ ఆదేశాలు పంపారు. దీంతో వారు పరుగులు తీస్తున్నారు.

2018 గ్రూప్ 1 పరీక్షల మూల్యాంకనంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని కొందరు అభ్యర్ధులు హైకోర్టుని ఆశ్రయించారు. అప్పటి నుంచీ దీనిపై విచారణ జరుగుతోంది. అయితే తాజాగా ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు.. అప్పటి జవాబు పత్రాల్ని భద్రపరచడంతో పాటు మూల్యాంకనంలో చోటు చేసుకున్న లోపాలపై సిట్ దర్యాప్తుకు ఆదేశాలు ఇచ్చింది. దీంతో ప్రభుత్వం సిట్ ను నియమించి దర్యాప్తు చేయిస్తోంది. ఈ దర్యాప్తు పూర్తయ్యే వరకూ అప్పట్లో నియామకాలు పొందిన వారిని కీలక పోస్టుల్లో నుంచి అప్రాధాన్య పోస్టుల్లోకి మార్చాలంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలు చేయని సీఎస్ ను హైకోర్టు ఇవాళ పిలిపించి మందలించినట్లు తెలుస్తోంది.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..!












Click it and Unblock the Notifications