ఏపీకి కేంద్రం వరం.. రూ.21,838 కోట్ల గ్రీన్ ఎనర్జీ కారిడార్‌కు కేంద్రం ఆమోదం!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి కేంద్రం మరో వరం ప్రకటించింది. పునరుత్పాదక ఇంధన రంగాన్ని బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. రూ.21,838 కోట్ల అంచనా వ్యయంతో గ్రీన్ ఎనర్జీ కారిడార్ జీఈసీ-3 పథకం కింద విద్యుత్ సరఫరా నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు అధికారికంగా ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు వ్యయంలో 33 శాతం మేర సుమారు రూ.7,207 కోట్లు కేంద్రం గ్రాంట్‌గా అందించనుంది.

మిగిలిన రూ.14,631 కోట్లను రుణాల రూపంలో సమీకరించుకోవాలని ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్‌కో నిర్ణయించింది. పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా అధిక సామర్థ్యం కలిగిన ప్రసార లైన్లు, కొత్త సబ్‌స్టేషన్లు ఏర్పాటు చేయడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. రాష్ట్ర విద్యుత్ ప్రసార వ్యవస్థను బలోపేతం చేసి, భవిష్యత్తు అవసరాలకు సన్నద్ధం చేయడంపై దృష్టి సారించారు. సౌర, పవన విద్యుత్ వంటి పునరుత్పాదక వనరుల నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను సమర్థవంతంగా అందించటానికి ఈ కారిడార్ కీలక పాత్ర పోషిస్తుంది.

AP Green Energy Corridor Centre Approves Rs 21 838 Crore mega Green Energy Corridor Project

దేశవ్యాప్తంగా గ్రీన్ ఎనర్జీ కారిడార్ పథకం కింద కేంద్రం భారీగా నిధులు కేటాయిస్తోంది. మొత్తం రూ.1.86 లక్షల కోట్ల వ్యయంతో ఈ పథకం అమలవుతోంది. దీని ద్వారా 135 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్‌ను గ్రిడ్‌కు అనుసంధానం చేయాలని, బ్యాటరీ స్టోరేజ్ సామర్థ్యాన్ని పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఈ ప్రాజెక్టు అమలైతే రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ఉత్పత్తి అయ్యే సౌర, పవన విద్యుత్‌ను సులభంగా అందించవచ్చు.

రాష్ట్రంలో ఇప్పటికే పలు గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు సాగుతున్నాయి. కాకినాడలో గ్రీన్ అమ్మోనియా ప్లాంట్‌లు, ఇతర పునరుత్పాదక యూనిట్లు ఏర్పాటవుతున్న నేపథ్యంలో బలమైన ప్రసార వ్యవస్థ అవసరం మరింత పెరిగింది. ఈ కారిడార్ ద్వారా విద్యుత్ నష్టాలు తగ్గి, సరఫరా మరింత స్థిరంగా ఉంటుంది. పారిశ్రామిక వినియోగదారులు, సాధారణ ఇళ్లకు కూడా నాణ్యమైన విద్యుత్ అందే అవకాశం ఉంటుంది.

దసరా డిమాండ్.. చికెన్ ధరలకు రెక్కలు.. తెలుగు రాష్ట్రాల్లో తాజా రేట్లు ఇవే!
దసరా డిమాండ్.. చికెన్ ధరలకు రెక్కలు.. తెలుగు రాష్ట్రాల్లో తాజా రేట్లు ఇవే!

ట్రాన్స్‌కో ఈ ప్రాజెక్టును వేగంగా అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కేంద్ర గ్రాంట్ వల్ల రాష్ట్ర ఆర్థిక భారం కొంత తగ్గుతుంది. రుణాలు సమీకరించి పనులు చేపట్టినా, దీర్ఘకాలంలో విద్యుత్ రంగం బలపడి రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేస్తుంది. పునరుత్పాదక ఇంధనంపై దేశం దృష్టి సారించిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో ఈ మెగా ప్రాజెక్టు ఆమోదం సానుకూల పరిణామంగా చెప్పొచ్చు. గ్రిడ్ బలోపేతం అయితే భవిష్యత్తులో మరిన్ని పెట్టుబడులు రావడానికి కూడా అనుకూల వాతావరణం ఏర్పడుతుందని ఏపీ సర్కార్ భావిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+