పవన్ కామెంట్స్ పై అంబటి ఫైర్-అసలురూపమిదే-వందసార్లు ప్యాకేజ్ స్టారనే అంటా...
వైసీపీ నేతలపై ఇవాళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలపై మంత్రుల ఎదురుదాడి కొనసాగుతోంది. పవన్ వ్యాఖ్యలపై వైసీపీ మంత్రులు ఒక్కొక్కరిగా స్పందిస్తున్నారు. ఇదే క్రమంలో జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు కూడా దీనిపై స్పందించారు.
పవన్ కళ్యాణ్ పై మంత్రి అంబటి రాంబాబు కీలక కామెంట్స్ చేశారు. పవన్ కళ్యాన్ అసలు సిసలు అయిన రూపం, ఈ రోజు బయట పడిందని అంబటి వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడు దగ్గర ప్యాకేజీ తీసుకొని రాష్ట్ర రాజకీయాలు చేస్తున్నాడంటూ పవన్ ను ఆయన విమర్శించారు. అందుకే పవన్ కళ్యాణ్ ఒక ప్యాకేజీ స్టార్ అని మంత్రి అన్నారు. ఇదే మాటను ఒకసారి కాదు వంద సార్లు అంటానన్నారు.

కాపుల గురించి మాట్లాడే నైతిక హక్కు పవన్ కళ్యాణ్ కు లేదని మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు హయాంలో కాపు నేత ముద్రగడ పద్మనాభం కుటుంబాన్ని హింసించినప్పుడు, నువ్వు ఎందుకు స్పందించలేదని పవన్ కళ్యాణ్ ను అంబటి ప్రశ్నించారు. జనసెనికులకు ఈ సందర్భంగా అంబటి ఓ హెచ్చరిక చేశారు. కుక్క తోక పట్టుకొని గోదారి ఈదకండని వారికి మంత్రి సూచించారు. చివరికి నువ్వు చూపించే చెప్పే నీ పార్టీ సింబల్ అవుతుందని అంబటి వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications