పవన్ కు మంత్రి నారాయణ అండ-హోంమంత్రికి కీలక సూచన..!
ఏపీలో సాఫీగా సాగిపోతున్న కూటమి రాజకీయాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ అనుకోకుండా ఓ ట్విస్ట్ ఇచ్చారు. తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో అభివృద్ధి కార్యక్రమాల కోసం వెళ్లిన పవన్.. అక్కడ స్థానికులు అడిగిన ఓ ప్రశ్నకు స్పందిస్తూ హోంమంత్రి వంగలపూడి అనితపై రెచ్చిపోయారు. అంతే కాదు ఆమెను సరిగ్గా పనిచేస్తారా లేక తననే హోంశాఖ తీసుకోమంటారా అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు జాతీయ స్దాయిలో సైతం చర్చనీయాంశమయ్యాయి.
రాష్ట్రంలో వరుస అత్యాచారాలు, మహిళలపై అఘాయిత్యాలపై పిఠాపురంలో జనం అడిగిన ప్రశ్నకు పవన్ స్పందిస్తూ..తాను హోం మంత్రి అయితే పరిస్థితులు వేరేలా ఉంటాయని వ్యాఖ్యానించారు. విమర్శలు చేసే వారిని ఇలాగే వదిలేస్తే హోం మంత్రి గా తాను బాద్యతలు తీసుకుంటానన్నారు. అలాగే ఇలాంటి ఘటనలపై హోం మంత్రి అనిత రివ్యూ చేయాలని కూడా సూచించారు. అలాగే పోలీసులు ఇలాంటి దారుణాలు చేసే వారిని కులం, మతం అంటూ వదిలేస్తే తిరగబడాలని కూడా పవన్ పిలుపునిచ్చారు. దీంతో పవన్ వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి.

వీటిపై చంద్రబాబు కేబినెట్ లో మరో మంత్రి నారాయణ స్పందించారు. పవన్ వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి నారాయణ..సీఎం, డిప్యూటీ సీఎంకు కేబినెట్ ్పోర్ట్ పోలియోలపై స్పందించే స్వేచ్ఛ ఉంటుందన్నారు. డిప్యూటీ సీఎం వ్యాఖ్యలను అలర్ట్‌గా తీసుకోవాలని హోంమంత్రికి నారాయణ సూచించారు. సీఎం చంద్రబాబు అందరినీ కో-ఆర్డినేట్ చేయగలరంటూ తనదైన శైలిలో ఓ వ్యాఖ్య చేసి నారాయణ ముగించారు..












Click it and Unblock the Notifications