APCRDA Office: అమరావతి దిక్సూచి రెడీ-రేపే సీఎం ఓపెనింగ్-కీలక ఫీచర్స్ ఇవే..!
ఏపీ రాజధాని అమరావతికి అతి ముఖ్యమైన నిర్మాణం రేపు (సోమవారం) ప్రారంభం కాబోతోంది. రాజధాని నిర్మాణ వ్యవహారాలకు మార్గదర్శనం చేయబోతున్న సీఆర్డీఏ కేంద్ర కార్యాలయం ఇప్పటికే నిర్మాణ పనులు పూర్తి చేసుకుంది. అధునాతన ఫీచర్లతో ఈ నిర్మాణాన్ని పురపాలకశాఖ చేపట్టింది. అమరావతి నుంచి కార్యకలాపాలు సాగించేందుకు ప్రారంభం కాబోతున్న మొట్టమొదటి పాలనా భవనం ఇదే కావడం విశేషం. రేపు ఉదయం 9.54 నిమిషాలకు సీఎం చంద్రబాబు దీన్ని ప్రారంభిస్తారు.
అమరావతి దిక్సూచి
ప్రజా రాజధానిలో పాలనా సౌలభ్యం కొరకు అన్ని హెచ్ వో డీలు ఒకే చోట, ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా సరికొత్త హంగులతో ఈ భవన సముదాయాన్ని నిర్మించారు. అమరావతికి భూములిచ్చిన రైతులకు దగ్గరగా సీఆర్డీఏ ప్రధాన కార్యాలయం నిర్మించారు. రాజధాని అమరావతిని ప్రతిబింబించేలా భవనం ముందు A అక్షరంతో ఎలివేషన్ ఇచ్చారు. ఇకపై అమరావతి నిర్మాణ పనులన్నీ ఇక్కడి నుంచే పర్యవేక్షణ చేయనున్నారు. అమరావతిలో సీడ్ యాక్సిస్ రోడ్ E3-N11 జంక్షన్ వద్ద రాయపూడి సమీపంలో మున్సిపల్ శాఖ ప్రధాన కార్యాలయం నిర్మాణాన్ని 2017లో ప్రారంభించగా...ఇక్కడ ఒక ప్రధాన భవనంతో పాటు ఇతర భవనాల నిర్మాణం జరిగింది..

సీఆర్డీఏ ఆఫీసు నిర్మాణం..
మొత్తం 4.32 ఎకరాల విస్తీర్ణంలో జీ ప్లస్ 7((G+7) భవనం 3 లక్షల 7వేల 326 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణం చేశారు. ఈ విస్తీర్ణంలో ప్రధాన భవనం 0.73 ఎకరాలు,గ్రీన్ జోన్ 0.88 ఎకరాలు,పార్కింగ్ ప్రాంతం 1.36 ఎకరాలు,ఓపెన్ స్పేస్ 0.96 ఎకరాలు,ఎస్టీపీ 0.39 ఎకరాల్లో నిర్మాణం చేసారు. జీ ప్లస్ 7(G+7) లో శాఖలవారీగా కేటాయింపులు చేశారు.

ఏయే ఫ్లోర్ లో ఏమేం ఉన్నాయి ?
గ్రౌండ్ ఫ్లోర్-23,814 చ.అ-రిసెప్షన్,పబ్లిక్ ఎక్స్ పీరియన్స్ సెంటర్,రెస్టారెంట్,బ్యాంక్,ఏఐ కమాండ్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్-30,886 చ.అ - కాన్ఫరెన్స్ హాల్స్, సెకండ్ ఫ్లోర్ - 30,886 చ.అ - సీఆర్డీఏ, థర్డ్ ఫ్లోర్ - 32,096చ.అ. - సీఆర్డీఏ, ఫోర్త్ ఫ్లోర్ - 30,862చ.అ. -మున్సిపల్ శాఖ డైరెక్టర్ ఆఫీస్, ఐదో ఫ్లోర్ - 32,096చ.అ.- సీఆర్డీఏ(ADCL), ఆరో ఫ్లోర్ - 32,096చ.అ.-ఏడీసీఎల్, ఏడో ఫ్లోర్ - 32,096చ.అ. - గౌరవ పురపాలక శాఖ మంత్రి గారి చాంబర్, ప్రిన్సిపల్ సెక్రటరీ చాంబర్,పబ్లిక్ హెల్త్ ఈఎన్ సీ,ఏడీసీఎల్, టెర్రస్ ప్రీ ఇంజనీర్డ్ బిల్గింగ్ డైనింగ్ కు కేటాయించారు. ఇవికాక హెడ్ రూమ్స్ 5,554,చ.అ,ప్రొజెక్షన్ శ్లాబ్స్ 3,113చ.అ.,టెర్రస్ PEB స్ట్రక్చర్ 32,062 చ.అడుగులు కలిపి మొత్తం 2,85,561 చ.అడుగుల విస్తీర్ణంలో(బిల్టప్ ఏరియా)లో నిర్మించారు.

హెచ్ఓడీ ఆఫీసులూ ఇక్కడే
ఆఫీస్ ప్రాంగణంలో సంపు,పంప్ రూం 4,029చ.అ.,ఎస్టీప 5014చ.అ.,డ్రైవర్స్ లాంజ్ 752 సెక్యూరిటీ రూం 225,యుటిలిటీ బ్లాక్ 11,745 చ.అడుగులతో కలిపి మొత్తం ఎక్స్టర్నల్ బ్లాక్ 21,765 చ.అడుగులు, ఇంటర్నల్ బ్లాక్,ఎక్స్ టర్నల్ బ్లాక్ ఏరియా కలిపి మొత్తం 3,07,326 చ.అడుగులతో నిర్మించారు. ఒక్కో లిఫ్ట్ లో 8 మంది ప్రయాణించే సామర్ధ్యంతో 7 లిప్ట్ లు ఏర్పాటు చేసారు. 170 కార్లు, 170 టూ వీలర్స్ పట్టేలా పార్కింగ్ నిర్మించారు. ప్రధాన కార్యాలయానికి పక్కనే మొత్తం 8 ఎకరాల్లో(పార్కింగ్ ఏరియాతో కలిపి) మరో నాలుగు భవనాలు నిర్మించారు. ఇవన్నీ ప్రీ ఇంజనీర్డ్ నిర్మాణాలే. ఒక్కొక్క భవం 41,500 చ.అ.ల విస్తీర్ణంలో నాలుగు భవనాలు అంటే 1,66,000చ.అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు.ఈ భవనంలో మున్సిపల్ శాఖ హెచ్ వోడీ లకు కేటాయించారు. భవనం -1-41,500,చ.అ -టిడ్కో,APUFIDC, భవనం -2-41,500,చ.అ -స్వచ్చాంధ్ర కార్పొరేషన్,రెరా అప్పిలేట్ అథారిటీ,గ్రీనింగ్ కార్పొరేషన్, భవనం -3-41,500,చ.అ-రెరా,టౌన్ ప్లానింగ్(DTCP), భవనం- 4-41,500,చ.అ -మెప్మా కార్యాలయానికి ఇచ్చారు.
అమరావతి పనుల స్టేటస్
అమరావతి నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం అమరావతిలో 79 ప్రాజెక్ట్ ల పనులు ప్రారంభమయ్యాయి. వీటిలో సీఆర్డీఏ నుంచి 12,762.46కోట్ల విలువైన 19 పనులు, ఏడీసీఎల్ నుంచి 36,737.06 కోట్ల విలువైన 60పనులు మొత్తంగా 49,499.52 కోట్ల విలువైన 79 పనులు జరుగుతున్నాయి. మొత్తం 54,693.09 కోట్ల విలువైన 90 పనులకు పాలనాపరమైన అనుమతులు రాగా....వీటిలో 79 పనులు ప్రారంభమయ్యాయి. మరో 7 పనులు టెండర్ల ప్రక్రియలో ఉన్నాయి. మరో 5 పనులకు టెండర్లు పిలవాల్సి ఉంది. ఇవికాకుండా మరో 36,577 కోట్ల విలువైన 20 పనులకు పాలనాపరమైన అనుమతులు రావాల్సి ఉంది.
-
రేషన్ కార్డు దారులకు బిగ్ అలర్ట్, కీలక మార్పులు..!! -
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్












Click it and Unblock the Notifications